హంపీలో ది ఇండియా హౌస్ ప్రారంభం
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. సోమవారం హంపీలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. 1905 బ్యాక్‌డ్రాప్‌లో లవ్, రెవెల్యూషన్ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-07-02T02:24:37Z dg43tfdfdgfd