హరీశ్​.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే ​: రాజగోపాల్​రెడ్డి

హరీశ్​.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే ​: రాజగోపాల్​రెడ్డి

  •  దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్​ మాట తప్పితే ఏంచేసినవ్ 

ఎల్బీ నగర్, వెలుగు: దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్​ మాట తప్పినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని హరీశ్​రావును ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ప్రశ్నించారు. డూప్లికేట్​ రాజీనామా పత్రంతో హరీశ్​రావు షో చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్​పరిధిలోని ఇబ్రహీంపట్రం నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ రోడ్​షోలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డితో కలిసి రాజగోపాల్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నదని, కేసీఆర్, కేటీఆర్ కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. బీఆర్ఎస్, మతతత్వ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టంగట్టాలని కోరారు. యువనాయకుడు చామల కిరణ్​ గెలిచేదాకా తాను నిద్రపోనని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T03:39:54Z dg43tfdfdgfd