హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం వెనకున్న అసలు నిజం... విస్తుపోయే వాస్తవాలు, అందరూ షాక్!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చాడు. 

 

దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే ఆయన కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 46 ఏళ్ళ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు. 

అలాంటి పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక సేవ చేస్తూ రియల్ హీరోగా జనాల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ కలచివేసింది. సౌత్ ఇండియాకు చెందిన పలువురు స్టార్స్ ఆయన కుటుంబాన్ని కలిసి సంతాపం ప్రకటించారు. 

ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ కి గుండె పోటు రావడానికి కారణం తెరపైకి వచ్చింది. ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వలనే మరణించారనే వాదన మొదలైంది. ఇండియాలో కోవిడ్ నుండి రక్షణ కోసం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ అనే రెండు రకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. 

 

కోవ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్న పరిశోధకులు కోవీషీల్డ్ తీసుకున్నవారికి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని అంటున్నారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట. పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, అందుకే గుండె పోటు వచ్చిందని నెటిజన్స్ అంటున్నారు.

కొద్దిరోజులుగా కోవీషీల్డ్ ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కోవీషీల్డ్ తీసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2021లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 

అలాగే మీరు 45 ఏళ్లకు పైబడిన వారైతే తప్పక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండని పునీత్ రాజ్ కుమార్ ఫోటో తో పాటు కామెంట్ పెట్టారు. సదరు పోస్ట్ క్రింద ఓ నెటిజన్.. సర్ మీరు కోవీషీల్డ్ తీసుకోవద్దు. 45 ఏళ్ళు పైబడిన వారికి అది శ్రేయస్కరం కాదని కామెంట్ చేసింది. పునీత్ రాజ్ కుమార్ 2021లో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 

 

పునీత్ రాజ్ కుమార్ కి గుండెపోటు రావడానికి  కారణం ఏదైనా కానీ... కోవీషీల్డ్ ప్రమాదం అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని వలనే ఆయన మరణించారనే ప్రచారం ఊపందుకుంది. 

2024-05-01T08:21:35Z dg43tfdfdgfd