హీరోయిన్ అవ్వాలంటే వారితో పడుకోవాలని కాల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Casting Couch: సినిమా రంగంలో 'క్యాస్టింగ్ కౌచ్' ఉందనేది కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునే వారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు. కొందరు వీటికి కమిట్ అయితే, మరికొందరు మాత్రం ఛీ కొడతారు. సొంత టాలెంట్‌నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతుంటారు. ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు, కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను షేర్ చేసుకుంటారు. తాజాగా హిందీ, మరాఠీ సినిమాల్లో పాపులర్ అయిన నటి సాయి తంహంకర్ (Sai Tamhankar) కూడా తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది.

మిస్ మాలిని వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తంహంకర్ షాకింగ్ విషయాలు చెప్పింది. కెరీర్ ప్రారంభంలో ఒకరోజు తనకు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పింది.

దిమ్మతిరిగే రిప్లై

"ఆ వ్యక్తి సినిమా ఆఫర్ గురించి మాట్లాడాడు. దర్శకుడు, నిర్మాతతో పడుకుంటావా అని డైరెక్ట్‌గా అడిగాడు. 'ఎవరైనా హీరోయిన్ అయితే జనరల్‌గా హీరోతో కలవాలి కానీ నువ్వు మంచి నటివి కాబట్టి దర్శకుడు, నిర్మాతతో లైంగికంగా కలిస్తే సరిపోతుంది' అని కూడా చెప్పాడు. దానికి నేను 'మీ అమ్మని పంపించవచ్చు కదా' అని అడిగాను. ఆ వ్యక్తి కొన్ని సెకన్ల పాటు నిశ్శబ్దంగా ఉండి, తరువాత మళ్లీ మాట్లాడలేదు" అని సాయి చెప్పుకొచ్చింది. ‘ఇకపై నాకు ఫోన్ చేయకూడదని నువ్వు అర్థం చేసుకున్నావనే అనుకుంటున్నాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను." అని ఆమె వివరించింది.

ఈ అనుభవం తర్వాత తనకు ఇలాంటి ఫోన్ కాల్స్ ఎప్పుడూ రాలేదని, తనని ఇలా ట్రీట్ చేయకూడదని వాళ్లకు బాగా అర్థమైనట్లు ఉందని సాయి చెప్పుకొచ్చింది. ఏదైనా తప్పుగా కాదనిపిస్తే దాని గురించి ధైర్యంగా, కచ్చితంగా, ఓపెన్‌గా మాట్లాడాలని ఆమె తెలిపింది.

బ్యాక్‌గ్రౌండ్

సాయి తంహంకర్ మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించింది. స్కూలు, కాలేజీల్లో చదువుకునేటప్పుడు నాటకాల్లో నటించింది. 17 ఏళ్ల వయస్సులోనే మరాఠీ టీవీ షోలలో యాక్ట్ చేయడం ప్రారంభించింది. మొదట చిన్న పాత్రలతో యాక్టింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసింది. బాలీవుడ్‌లోనూ ఆమె మొదట్లో బ్యాక్‌గ్రౌండ్ యాక్ట్రెస్‌గానే కనిపించేది. సాయి ఆమీర్ ఖాన్ నటించిన 'గజనీ'తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. జియా ఖాన్ పాత్రకు స్నేహితురాలిగా నటించింది.

'ఝకాస్', 'రిటా' వంటి మరాఠీ సినిమాల్లో నటించిన తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. బాలీవుడ్‌లో 2015లో విడుదలైన 'హంటెర్ర్ (Hunterrr)'లో కీ రోల్‌ పోషించింది. దాంతో ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయింది. ఆ తర్వాత 'లవ్ సోనియా', 'మిమి' వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ మూవీ 'భక్షక్'లో పోలీసు పాత్రలో మెప్పించింది.

2024-07-03T12:16:43Z dg43tfdfdgfd