ఢిల్లీలోని జాతీయ రహదారిపై బైక్ రైడింగ్ స్టంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై స్టంట్స్ చేశారు. దాంతో 20 ఏళ్ల ఆదిత్య, 19 ఏళ్ల అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరూ నజఫ్‌గఢ్‌కు చెందినవారు. బైక్‌పై వారు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీరిద్దరూ స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపారు. బైక్‌కి నంబర్ ప్లేట్ లేదని పోలీసులు తెలిపారు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. హెల్మెట్, అద్దం, లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా ప్రమాదకరంగా బైక్ నడిపినందుకు ఇద్దరిపైనా కేసు నమోదు చేశాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
మోటర్ వెహికిల్స్ చట్టం ప్రకారం పోలీసులు ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. ఐతే.. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోని ఇక్కడ చూడండి
ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వాళ్లు అమాయకుల్లా ఉన్నారు.. వారి స్టంట్స్ కూడా అలాగే ఉన్నాయి అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. ఇండియాలో స్పైడర్ మేన్‌కి కూడా ఛలాన్ తప్పదు అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. మార్వెల్కి కొత్త స్పైడర్ మేన్ దొరికాడు అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా.. బైక్ సంగతేంటి అని మరో యూజర్ కామెంట్ రాశారు.
2024-04-27T04:24:28Z dg43tfdfdgfd