NYMISHA REDDY: గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె.. వారి కళ్లల్లో ఆనందం కోసం..!

సంచలన నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ.. ఇటు ప్రచారంలోనూ ఘాటైన విమర్శలతో తన పంథాను కొనసాగిస్తూ.. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు కోణాలే కాకుండా.. రేవంత్ అన్నా అని ఎవరైనా దీనంగా పిలిస్తే చాలు ఏ స్థాయిలో ఉన్నా నేనున్నా.. అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి సాయం చేసే గొప్ప గుణం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అదే గుణం.. తన రక్తం పంచుకుని పుట్టిన తన కుమార్తె నైమిషా రెడ్డికి కూడా వచ్చింది. ఈరోజు ఆమె చేసిన గొప్ప పనే అందుకు నిదర్శనం.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని బీఎన్ రెడ్డి, సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించి.. సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్‌కు ఆ 30 మంది పిల్లలకు టికెట్లు కొని.. వాళ్లను నైమిషా రెడ్డే స్వయంగా మైదానానికి తీసుకెళ్లినట్లు సమాచారం.

కాగా.. అప్పటివరకు టీవీల్లో మ్యాచ్ చూసి సంబురపడిన ఆ పిల్లలు.. నేరుగా మ్యాచ్ చూస్తూ సంబురంతో గంతులు వేసినట్టు తెలుస్తోంది. ఆ చిన్నారుల కళ్లల్లో ఆ ఆనందం చూసేందుకే నైమిషా ఈ పని చేసినట్టు.. సన్నిహితులు చెప్పారు. ఈ పనితో పాటు నైమిషా పలు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ.. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఓవైపు.. తండ్రి రాజకీయాల్లో అగ్రెస్సివ్ లీడర్‌గా పేరు తెచ్చుకుంటే.. నైమిషా ఇలాంటి సమాజ సేవలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

కాగా.. ఇవాళ ఐపీఎల్‌ 2024లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు 9.4 ఓవర్లలోనే 166 పరుగుల లక్ష్యాన్ని సింపుల్‌గా చేధించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T17:59:18Z dg43tfdfdgfd