బట్టతల కారణంగా సూపర్ స్టార్ అవ్వాల్సిన నటుడు చివరకు.. చిన్న చిన్న పాత్రల్లో..

ఒకప్పుడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అని పిలుచుకునే అక్షయ్ ఖన్నా పరిస్థితి కూడా ఇలాంటిదే. ఇండస్ట్రీ ఫ్లాప్ నటుల్లో అక్షయ్ పేరున్నప్పటికీ వసూళ్ల పరంగా పెద్ద స్టార్లతో పోటీ పడుతున్నాడు. ఫ్లాప్ అయినప్పటికీ, సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూనే భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
అక్షయ్ ఖన్నా తన తండ్రి వినోద్ ఖన్నా చిత్రం 'హిమాలయ పుత్ర'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా 1997లో వచ్చింది. దీనికి పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించారు. వినోద్ ఖన్నా, హేమ మాలిని ప్రధాన పాత్రల్లో కనిపించగా, అక్షయ్ ఖన్నా రెండో కథానాయకుడిగా నటించారు. అక్షయ్ ఖన్నా సరసన అంజలా జవేరి నటించింది. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ ఫ్లాప్ అయ్యింది. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
'హిమాలయ పుత్ర' కథను ప్రేక్షకులు తిరస్కరించినప్పటికీ, సినిమాలో అక్షయ్ ఖన్నా నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా ద్వారా ఎవరైనా ఎక్కువ పేరు తెచ్చుకున్నారంటే అది అక్షయ్ ఖన్నా.  (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
'హిమాలయ పుత్ర' తర్వాత, అదే సంవత్సరంలో అక్షయ్ బ్లాక్ బస్టర్ చిత్రం 'బోర్డర్'లో కనిపించాడు. 'బోర్డర్' విడుదలైన దాదాపు 2 సంవత్సరాల తర్వాత, అక్షయ్ తాల్ (1999), దిల్ చాహ్తా హై (2001), హుమ్రాజ్ (2002), హంగామా (2003), హల్చుల్ (2004), 36 చైనా టౌన్ (2006), రేస్ ( 2008), టీస్ మార్ ఖాన్ (2010), దీవాంగి (2002), గాంధీ, మై ఫాదర్ (2007), ఆక్రోష్ (2010), డిషూమ్ (2016), ఇత్తెఫాక్ (2017), సెక్షన్ 375 (2019), దృశ్యం 2 ( 2022) వంటి చిత్రాల్లో నటించాడు. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
అక్షయ్ ఖన్నా తన 27 ఏళ్ల నటనా జీవితంలో దాదాపు 55 చిత్రాలలో పనిచేశాడు. పాపం, అతను హీరోగా వచ్చిన ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. అతని 55 చిత్రాలలో, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారిన చిత్రాలు చాలా ఉన్నాయి.
ఈ జాబితాలో దహెక్, బోర్డర్ హిందుస్థాన్, డిషూమ్, మామ్, ఇత్తెఫాక్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, దీవార్, సలామ్-ఎ-ఇష్క్, నఖాబ్, గాంధీ మై ఫాదర్, షార్ట్ కట్-ది కాన్ ఈజ్ ఆన్...., డోలీ సజా కే రఖ్నా, కుద్రత్, ఆప్ కీ ఖతీర్ వంటి సినిమాలు ఉన్నాయి. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
ఒక వైపు, అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుండడంతో టెన్షన్, ఒత్తిడి కారణంగా, అతని లుక్ చాలా మారడం ప్రారంభించింది. అలా తన యవ్వనం నుండి వృద్ధుడిలా కనిపించాడు. తలపై వెంట్రుకలు తగ్గడం వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో, అక్షయ్ తన లుక్స్ గురించి, బట్టతల గురించి బహిరంగంగా మాట్లాడాడు. చాలా చిన్న వయసులోనే మొదలైందని.. దీంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని చెప్పాడు. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
నేను నిరుత్సాహపడ్డాను. నా గుండె పగిలిపోయింది. ఇది మానసికంగా దెబ్బతీసింది. ఈ అనుభూతి మిమ్మల్ని కూడా చంపేస్తుంది. ఈ బట్టతల నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. యువ నటుడిగా నా ఆత్మవిశ్వాసం కోల్పోయిందని పేర్కోన్నాడు. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)
ఈరోజు అక్షయ్ తక్కువ సినిమాలు చేసినా కోట్లకు పడగలెత్తాడు. GQ ఇండియా ప్రకారం, అక్షయ్ నికర విలువ 148 కోట్లు. తన గత చిత్రం 'దృశ్యం 2' కోసం 2.5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఈ చిత్రం 2022లో విడుదలైంది.
ఈ చిత్రంలో అక్షయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ అక్షయ్ ఖన్నాకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన తన 49 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా ఒంటరిగానే ఉంటున్నాడు. (ఫోటో కర్టసీ @akshaye_khanna_ Instagram)

2024-03-28T12:44:15Z dg43tfdfdgfd