రూ. 3 కోట్ల డైమండ్.. రూ. 30 లక్షలకే..

రూ. 3 కోట్ల డైమండ్.. రూ. 30 లక్షలకే..

  •  ప్రజలను నమ్మించి అమ్మేందుకు యత్నించిన ముఠా  
  • అరెస్ట్ చేసిన హబీబ్ నగర్ పోలీసులు 

మెహిదీపట్నం, వెలుగు: రూ. కోట్ల విలువైన బ్లూ డైమండ్ అంటూ.. తక్కువ ధరకే ఇస్తామని ప్రజలను నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఓ ముఠా హబీబ్ నగర్ పీఎస్ పోలీసులకు పట్టుబడింది. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. ముంబైలోని విక్టరీ ఈస్ట్ ఠాగూర్ నగర్ కు చెందిన బాలచంద్ర తేలూరి (48),  ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు నకిలీ బ్లూ డైమండ్ అమ్మేందుకు ప్లాన్ చేసి, దాన్ని తీసుకుని హైదరాబాద్ కు వచ్చాడు.

 ఇక్కడ మరో ఇద్దరు ఫ్రెండ్స్ రియాసత్ నగర్, మిథాని బస్ డిపో ప్రాంతానికి చెందిన జొమాటో డెలివరీ బాయ్ ముస్తఫా అహ్మద్ ఖాన్ (41),  కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన పంబ్లర్ సయ్యద్ సాజిద్ అలీ (40) తో కలిసి బుధవారం హబీబ్ నగర్ ప్రాంతాల్లో తిరుగుతూ.. తమ వద్ద రూ. 3 కోట్ల విలువైన బ్లూ డైమండ్ ఉందంటూ.. అత్యవసరంగా డబ్బు కావాల్సి ఉండగా.. రూ. 30 లక్షలకే అమ్ముతామని స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బ్లూ డైమండ్ విలువ రూ. 1000 కూడా ఉండదని, ప్రజలను నమ్మి మోసపోవద్దని, ముంబై నుంచి ఇలాంటి ముఠాలు వచ్చి స్థానికులను మోసగిస్తుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. సీఐ రాంబాబుతో పాటు హబీబ్ నగర్ పోలీసులను డీసీపీ అభినందించారు.

ఇంట్లోని గోల్డ్, డబ్బు, సౌదీ కరెన్సీ ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన దొంగను హబీబ్ నగర్ పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. మల్లేపల్లికి చెందిన అజార్ అహ్మద్ ఈనెల 23న రాత్రి బయటికి వెళ్లి, తిరిగి తెల్లవారుజామున ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉన్నా యి. ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపి చూసేసరికి,  బ్యాగులోని16 తులాల బంగారు నగలు, 3900 సౌదీ రియాల్ కరెన్సీ, రూ. 2.5 లక్షల నగదు, ఐ ఫోన్, ట్యాబ్ కనిపించకుండా పోయాయి. పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు.  సీసీ టీవీ ఫుటేజ్ ఆధా రంగా గురువారం దొంగను అదుపులోకి తీసుకొని, అతడి వద్ద రూ. 1,02,500 నగ దు, 2400 రియాల్స్ కరెన్సీ, 11 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ , ట్యాబ్ ను స్వాధీ నం చేసు కుని రిమాండ్ కు పంపినట్టు పోలీసులు తెలిపారు. హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ రాంబాబుతో పాటు క్రైమ్ పోలీసులను సౌడ్ అండ్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T02:43:19Z dg43tfdfdgfd