వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్..

వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్..

అది స్కూల్.. చిన్న చిన్న పిల్లలు చదువుకోవటానికి వస్తుంటారు.. అలాంటి స్కూల్ లో ఓ లుచ్చాగాడు ఉన్నాడు.. వాడు ప్యూన్ గా పని చేస్తున్నాడు.. స్కూల్ కు వచ్చే పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తూ.. ఓ చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఈ నీచుడు.. విషయం బయటకు రావటంతో.. పోలీసులు తీవ్ర చర్యలు తీసుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర పూణె సిటీలోని ఓ ప్రైవేట్ స్కూల్.. అక్కడ ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు పిల్లలు. అదే స్కూల్ లో ప్యూ్న్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. పదేళ్ల బాలుడుకి.. తన ఫోన్ లోని అశ్లీల సినిమాలు, ఫొటోలు, వీడియోలు చూపిస్తున్నాడు. ఆ బాలుడు వద్దన్నా.. బలవంతంగా అశ్లీల వీడియోలు చూపిస్తూ.. లైంగిక వేధింకపులకు పాల్పడ్డాడు. భయపడిన బాలుడు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో... వారు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. 

విచారణ చేసిన పోలీసులు.. ప్యూన్ మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా అందులో అశ్లీల సినిమాలు డౌన్ లోడ్ అయిన విషయం స్పష్టంగా ఉంది.. అంతే కాకుండా స్కూల్ ఆవరణలోని సీసీ కెమెరాల్లోనూ ప్యూన్.. ఆ బాలుడితో చనువుగా ఉంటున్న విషయం నిర్థారణ అయ్యింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం సెక్షన్ 12 కింద కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారు. 

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. నిఘా పెంచుతామని స్పష్టం చేసింది. ఇది సున్నితమైన అంశం కావటంతో.. బాధితుడు, బాధితుల పేర్లు వెల్లడించలేదు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T06:58:43Z dg43tfdfdgfd