BRAHMAMUDI TODAY మే 06 ఎపిసోడ్: ‘మీ ఇంటికొస్తా లేదా మీడియాను కలుస్తా’ బాబు తల్లి మాయా బెదిరింపులు.. సీసీ ఫుటేజ్‌లో నిజాలు

Brahmamudi Today 2024 May 06 Episode: కళావతికి రాజ్ డిలెట్ చేసిన సీసీ ఫుటేజ్ దొరికేసింది. ఈ క్రమంలోనే బాబు తల్లి మాయా గుట్టు ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Brahmamudi 2024 may 06 Episode: రాజ్ దగ్గర పది లక్షలు తీసుకున్నవాడికి.. బాబుకి బంధువు ఏమో అనుకున్నాం కానీ.. బాబుకి, ఆ వ్యక్తికి ఏ సంబంధం లేదు. వాడొక కేవలం బేబీ కేర్ సెంటర్ నడుపుకునేవాడు. వాడు రాజ్, బాబు తల్లి ఇద్దరూ మాట్లాడుకున్న కొన్ని మాటల్ని విని.. బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడని నేటి కథనంలో తేలిపోయింది. రాజ్ ఫోన్‌లో ల్యాండ్ లైన్ నంబర్ సంపాదించిన కళావతి.. ఆ నంబర్‌ని అప్పూకి ఇచ్చి వివరాలు కనుక్కోమన్నప్పటి నుంచి ఈ కథనం మళ్లీ ఉత్కంఠగా మారింది. అడ్రస్ తెలుసుకోవడంతో పాటు.. ఇద్దరూ నకిలీ పోలీసుల్ని తోడగా తీసుకుని.. పది లక్షలు తీసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్తారు కావ్య, అప్పూలు. వీళ్ల పక్కనే పోలీసుల్ని చూసిన ఆ వ్యక్తి బెదిరిపోయి.. నిజం చెప్పడానికి సిద్ధమవుతాడు.మేడమ్ ఆ రోజు రాత్రి..

‘మేడమ్.. ఆ రోజు..’ అని ఆ వ్యక్తి చెప్పడం మొదలుపెట్టబోతుంటే.. ‘ఏ రోజు?’ అంటాడు పోలీసుల్లో ఒకడు. ‘అదే మేడమ్.. ఫిబ్రవరి 18వ తారీఖున(కావ్య,రాజ్‌ల పెళ్లి రోజు రాత్రి) రాజ్ సార్.. మాయా మేడమ్ మాట్లాడుకోవడం చూశాను మేడమ్.. మాయా మేడమ్ రోజు తన బాబుని రెండు గంటల పాటు మా కేర్ సెంటర్‌లో ఉంచేది. ఆ రోజు రాత్రి వాళ్ల మాటలు విన్నాక ఆ బాబు రాజ్ సార్‌కి, మాయా మేడమ్‌కి ఇల్లీగల్‌గా పుట్టిన బిడ్డ అని అర్థమైంది మేడమ్..’ అంటూ ఆ రాత్రి తాను విన్నది చెబుతాడు.

చాటుగా మొత్తం వన్న కేర్ సెంటర్ ఓనర్(రాజ్ దగ్గర నుంచి పది లక్షలు అందుకున్న వ్యక్తి)

అయితే ఆ సీన్‌ని స్క్రీన్ మీద రాజ్, మాయాల మాటల్లోనే వీక్షకులకు కనిపించింది. రాజ్, మాయా ఎదురెదురుగా నిలబడి ఉంటారు. అప్పుడే ఆ బేబీ కేర్ సెంటర్ వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాయని చూసి.. ‘ఈవిడేంటి ఇక్కడుంది?’ అంటూ వాళ్ల మాటలు వినడం మొదలుపెడతాడు. మాయా చేతిలో రాజ్ తీసుకొచ్చిన బుడ్డోడు ఉంటాడు. రాజ్‌తో మాయా.. ‘బెదిరించడానికి వచ్చావా?’ అంటుంది కోపంగా. ‘బెదిరించడం ఆపమని చెప్పడానికి వచ్చాను..’ అంటాడు రాజ్. ‘అలా ఆపితే నాకు నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది?’ అంటుంది మాయ.

ప్లీజ్ తొందరపడకు.. రాజ్ రిక్వస్ట్..

‘జరిగింది అంతా మరిచిపో.. జరగాల్సింది నేను చూసుకుంటాను..’ అంటాడు రాజ్. ‘ఎంతకాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బతకాలి? ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఏం సాధిస్తావ్? నాకు ఇంక ఏ దారి లేదు.. అందుకే ఈ బిడ్డతో పాటు మీ ఇంటికి వచ్చి జరిగింది అంతా చెబుతాను’ అంటుంది మాయ. ‘ప్లీజ్ తొందరపడకు..’ అంటాడు రాజ్. ‘నేను ఇప్పటికే ఆలస్యం చేశాను’ అంటుంది మాయ. ‘దయచేసి ఏ గొడవ చేయొద్దు.. నేను తప్పకుండా మంచి మార్గం వెతుకుతాను’ అంటాడు రాజ్.

మాయ ఎలా ఉంటుంది? ఇంకా రివాల్ కాని కొత్త క్యారెక్టర్(బాబు తల్లి)

‘మళ్లీ నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారా? మర్యాదగా నా బిడ్డను నన్ను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో వాళ్ల ముందు నిజం చెప్పాలి. ఈ బిడ్డను వారసుడిగా పరిచయం చెయ్యాలి..’ అంటుంది మాయ కోపంగా. అయితే మాయా ఎలా ఉంటుందన్నది మాత్రం ప్రేక్షకులకు ఇంకా రివీల్ చెయ్యలేదు. కేవలం కళ్లు మాత్రమే చూపించారు. మనిషిని వెనుక నుంచి చూపించారు. ఎదురుగా చూపించే సమయంలో బ్లర్ వేసి కవర్ చేశారు. సో మాయా ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. వాళ్ల మాటలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ కేర్ సెంటర్ వ్యక్తి వింటూనే ఉంటాడు.

మాయా బెదిరింపులు.. ‘మీడియాని కలుస్తా’

‘అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఓపిక పట్టు.. ఒకేసారి బిడ్డతో పాటు నిన్ను కూడా తీసుకుని వెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నట్లుగానే.. బిడ్డను తీసుకెళ్లి మా ఇంటి వారసుడిగా చేస్తాను.. ఆ తర్వాత సమయం చూసి.. నిన్ను కూడా తీసుకుని వెళ్తాను..’ అంటాడు రాజ్. ‘నిన్ను ఎలా నమ్మాలి?’ అంటుంది మాయ. ‘ప్రస్తుతం నన్ను నమ్మడం తప్ప నీకు ఇంకోదారి లేదు..’ అంటాడు రాజ్. ‘సరే.. మాట మార్చినా.. నా బిడ్డకు ఎలాంటి హాని తలపెట్టినా నేను సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వెళ్తాను..’ అంటూ బెదిరిస్తుంది మాయ.

అంతా విని బ్లాక్ మెయిల్ చేసిన కేర్ సెంటర్ వ్యక్తి..

‘అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు.. నాది హామీ.. నేను మాటిస్తున్నాను..’ అంటూ రాజ్.. మాయ దగ్గర నుంచి బాబుని అందుకుంటాడు. అది మాట ఆ వ్యక్తి విన్న విషయం. వాళ్ల మాటల్ని బట్టి ఆ బాబు.. రాజ్, మాయలకు పుట్టిన బిడ్డ అని అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తి. ఆ రాత్రి నుంచి రాజ్‌ని బెదిరించి డబ్బులు లాక్కుంటూ వస్తున్నాడట. ‘అది మేడమ్ జరిగింది.. నాకు అది పెద్ద రహస్యమని.. అర్థమైంది. పైగా చూడటానికి రాజ్ సార్ బాగా డబ్బు ఉన్న వారిలా కనిపించారు. ఆరా తీసి.. బ్లాక్ మెయిల్ చెయ్యడం స్టార్ట్ చేశాను అంతే మేడమ్..’ అంటాడు వణికిపోతూ ఆ వ్యక్తి.

మాయా అంటే మాయలేడీనా? ఎందుకు ఫేక్ అడ్రస్ ఇచ్చింది?

‘మరి ఆ మాయా ఎక్కడుందో తెలుసా?’ అంటుంది కావ్య. ‘తెలియదు మేడమ్..’ అంటాడు ఆ వ్యక్తి. ‘రేయ్ నిజం చెప్పు..’ అంటుంది అప్పూ కోపంగా. నకిలీ పోలీసులు కూడా హడలెత్తిస్తారు. కానీ అతడు మాత్రం ‘నిజంగా తెలియదు మేడమ్.. ఆ మాయా ఇచ్చిన ఫోన్ నంబర్ అడ్రస్ అంతా ఫేక్ మేడమ్.. బాబుని రాజ్ సార్ తీసుకున్న తర్వాత నేను మాయా మేడమ్‌ని ఎప్పుడూ చూడలేదు’ అంటాడు ఆ వ్యక్తి. దాంతో కావ్య, అప్పూ.. ఆ నకిలీ పోలీసులు బయటికి వెళ్లిపోతారు. ‘బావని నువ్వు గుడ్డిగా నమ్మేశావ్ అక్కా.. ఆ బిడ్డ బావ బిడ్డేనేమో అక్కా’అంటుంది అప్పూ.

ఒకసారి మనం ఆఫీస్‌కి వెళ్దాం అప్పూ..

‘లేదు అప్పూ.. ఆయన మా పెళ్లి రోజు ఇంట్లో అందరితో.. ‘‘ఒక నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు తప్పా.. ఒక నిజం చెప్పాలి అనలేదు. అంటే.. ఆ రోజు ఆఫీస్ నుంచి బయటికి వచ్చే వరకూ.. ఆ బిడ్డ గురించి ఆయనకు ఏం తెలియదు అప్పూ.. ఇదంతా తెలియంటే ఆ రోజు ఏం జరిగిందో ఆఫీస్‌లో తెలుసుకోవాలి పదా వెళ్దాం’ అంటుంది కావ్య. దాంతో అప్పూ.. ఆ నకిలీ పోలీసుల్ని పంపించేసి.. ఆఫీస్‌కి బయలుదేరతారు. ఫిబ్రవరి 18వ తారీఖున రాజ్‌ని కలవడానికి ఎవరైనా వచ్చారా అని శ్రుతిని, మిగిలిన ఉద్యోగుల్ని ఆరా తీస్తుంది కావ్య.

ఆఫీస్‌లో ఆరాలు..

‘లేదు మేము చూడలేదు’ అంటారు ఆఫీస్‌లో అంతా. ఇక సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి.. సీసీ ఫుటేజ్ చూపించమంటారు ఆ రాత్రిది. అయితే అందులో 3 గంటల ఫుటేజ్ డిలెట్ అయ్యి ఉంటుంది. ఎవరు డిలెట్ చేశారు అని ఆ సెక్యూరిటీ గార్డ్‌ని గదమాయిస్తే.. ‘రాజ్ సారే ఆ ఫుటేజ్‌ని డిలెట్ చేసి.. కంగారుగా కారులో వెళ్లిపోయారు మేడమ్’ అంటాడు ఆ సెక్యూరిటీ గార్డ్.‘ఆ హార్డ్ డిస్క్ ఉంటే.. పోయిన ఫుటేజ్‌ని వెనక్కి తీసుకోవచ్చు అక్కా’ అంటుంది అప్పూ. ‘అవునా.. సరే అయితే..’ అంటూ ఆ హార్డ్ డిస్క్ ఇవ్వమని సెక్యూరిటీ గార్డ్‌కి చెబుతుంది కావ్య.

ఆ డిలిటెడ్ వీడియో కళావతి ముందు..

సెక్యూరిటీ గార్డ్ హార్డ్ డిస్క్ ఇస్తా అంటాడు. వెంటనే కావ్య.. అప్పూతో.. ‘అప్పూ ఆ కిట్టూగాడి సాయం తీసుకుని.. ఆ హార్డ్ డిస్క్‌లో ఆ డిలెట్ అయిన వీడియోని వెనక్కి వచ్చేలా చెయ్ చాలు’అంటుంది కావ్య. సరే అంటుంది అప్పూ. ఇక కమింగ్ అప్‌లో.. ‘ఆ వీడియో వచ్చింది అక్కా.. ల్యాప్ టాప్‌లో చూడు. పంపిస్తున్నా’ అంటూ వీడియో పంపిస్తుంది అప్పూ. అయితే కావ్య ఆ వీడియో చూసి షాక్ అవుతున్నట్లుగా చూపిస్తారు సీన్‌లో. అయితే కావ్య ఎందుకు షాక్ అయ్యింది. మాయ రూపం రేపు అయినా చూపిస్తారా లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T03:59:53Z dg43tfdfdgfd