KALKI 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. మన దగ్గరే.. ప్రత్యేకతలు ఇవే!

కల్కి 2898 ఏడీ.. ప్రభాస్ నటించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ థియేటర్లలో ఎంత కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రూ.500 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజుకు ముందు హీరో ప్రభాస్ వాడిన బుజ్జి కారు హాట్ టాపిక్‌గా మారగా.. రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓ గుడి నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్కి సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ దశలో కల్కి సినిమాలో హీరో ఆయనేనా అనే రేంజులో ఇరగదీశారు అమితాబ్.

అయితే సినిమా ప్రారంభంలో యంగ్ లుక్‌లో కనిపించే అశ్వథ్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్.. ఆ తర్వాత కొద్ది సేపటికి ఓల్డ్ లుక్‌లో కనిపిస్తారు. శాపగ్రస్తుడైన అశ్వత్థామ ఎంట్రీ సమయంలో ఓ గుడిలో ఆయన ఉన్నట్లు చూపించారు. ఈ గుడి ఫోటోలు, వీడియోలే ఇప్పుడే నెట్టింట వైరల్ అవుతున్నాయి. పురాతనమైన ఈ ఆలయం నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులో ఉందంటూ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే.. కల్కిలో చూపించిన గుడి అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో పెన్నా నదీతీరంలో ఈ నాగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్టించారని స్థానికులు చెబుతున్న మాట. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయి ఉందని.. 2020లో ఇసుక తవ్వకాల్లో ఈ నాగేశ్వర ఆలయం బయటపడినట్లు చెప్తున్నారు. ఇక కల్కి సినిమా తర్వాత ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. పలువురు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఆ రకంగా ఈ పురాతన ఆలయం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ప్రభుత్వం ఈ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేసి.. పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా కల్కి సినిమా కారణంగా ఓ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T16:10:37Z dg43tfdfdgfd