HEMANT SOREN | హేమంత్‌ సోరెన్‌ నివాసం వద్ద కోలాహలం : స్వీట్లు పంచిన అభిమానులు

Hemant Soren : భూకుంభకోణం కేసులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్‌ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సోరెన్‌ అభిమానులు ఆయన నివాసం వద్ద స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (​​former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్‌ (Hemant Soren)కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన ఆయనకు జార్ఖండ్‌ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.

Read More :

PV Narasimha Rao: మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకు మోదీ నివాళి

2024-06-28T07:48:22Z dg43tfdfdgfd