81 మందితో టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ

  • నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, జూన్‌ 29: సింగరేణి వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ 81 మం దితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నూతన సెంట్రల్‌ కమిటీని ఎన్నుకున్నట్టు ఆ యూనియన్‌ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

కమిటీ చీఫ్‌ జనరల్‌ సెక్రటరీగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కాపుకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ వాసి కే సురేందర్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రామగుండం డివిజన్‌-2కు చెందిన మాదాసు రా మ్మూర్తి, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా నూనె కొముర య్య, ఉపాధ్యక్షులుగా బడికల సంపత్‌కుమార్‌, ధ రావత్‌ మంగీలాల్‌, జంగిలి రవీందర్‌, నల్లవెల్లి సదానందం, కుశన వీరభద్రం, సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధిగా పర్లపల్లి రవి, కోశాధికారిగా లావుడియా వెంకటేశ్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా ఎండీ జాహిద్‌పాష, బండి రమేశ్‌, రాజశేఖర్‌, ఎస్‌ రంగనాథ్‌, పింగిలి సంపత్‌రెడ్డి, సంయు క్త కార్యదర్శులుగా చిల్పూరి సతీశ్‌, పానుగంటి సత్త య్య, బేతి చంద్రయ్య, సిద్దంశెట్టి సాజన్‌, దాసరి శ్రీనివాస్‌, వాసికార్ల కిరణ్‌కుమార్‌, రత్నం, అవినాష్‌, ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు.

ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శులుగా చల్లా రవీందర్‌రెడ్డి, వొద్నాల రాజయ్య, ఇందూరి సత్యనారాయణ, అనుముల సత్యనారాయణ, పొగాకు రమేశ్‌, మునిగాల రమేశ్‌బాబు, పోలాడి శ్రీనివాసరావు, వారణాసి గౌరీపతి, ఇనుముల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పెండ్లి అన్వేష్‌, సీహెచ్‌ వెంకటరమణ, కేవీ రామకృష్ణ, అచ్చు శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌ ముస్తాన్‌, రఘోత్తంరెడ్డి, బూర్గుల రవికుమార్‌, ఊరెడ్డి రమేశ్‌, రాజేశంతోపాటు 37 మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించినట్టు తెలిపారు.

2024-06-29T22:16:02Z dg43tfdfdgfd