CHIRANJEEVI LAKSHMI SOWBHAGYAVATHI TODAY: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: త్వరలో మిత్రకు పెను ప్రమాదం, తప్పించడం ఎవరి తరం కాదు: లక్ష్మీతో దీక్షితులు గారు

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అరవింద మిత్ర దగ్గరకు వచ్చి లక్ష్మీ మీద నీకు ఉన్న కోపం నిజమా ప్రేమ నిజమా అని ప్రశ్నిస్తుంది. లక్ష్మీ మీద ప్రేమ తనకు ఎప్పుడో చచ్చిపోయిందని ఇప్పుడు ఆ ప్రేమ స్థానంలో ద్వేషం పెరిగిందని మిత్ర అంటాడు. దానికి అరవింద ఐదేళ్లుగా లేని లక్ష్మి జ్ఞాపకం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందని అంటుంది. నీ మనసులో పదిలంగా దాచుకున్న ఫొటోని మనీషా ముక్కలు చేసింది. దాన్ని నేను తీసుకొచ్చి అది నువ్వు దాచుకుంటావో అవసరం లేదు అని వదిలేస్తావో నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిత్ర ఆలోచించి లక్ష్మీ చేసిన ద్రోహం గుర్తు తెచ్చుకొని ఫొటో ముక్కులు ఎగిరిపోవాలని ఫ్యాన్ వేసేస్తాడు. 

మనీషా: ఇందాక ఆ లక్కీ ఏం చెప్పిందో గుర్తుందా ఆంటీ. లక్ష్మీ ఫొటో మిత్ర గదిలో దొరికిందని చెప్పింది. మిత్ర రూమ్‌లో ఆ ఫొటో ఎందుకు ఉన్నట్లు. మిత్ర గదిలోనే ఆ ఫొటో ఉందా లేకపోతే మిత్ర మదిలోనూ ఉందా. కొంప తీసి లక్ష్మి బతికే ఉందా ఏంటి.

దేవయాని: చనిపోయిన లక్ష్మి తిరిగి రావడం జరగదులే కానీ దాన్ని వదిలేయ్. నేను దీక్షితులు గారి దగ్గరకు వెళ్తున్నా నువ్వు రా. వివేక్ జాతకం చూపించి దాని ఆధారంగా పెళ్లి ముహూర్తం పెట్టిస్తా. 

దీక్షితులు గారి దగ్గరకు లక్ష్మీ వెళ్తుంది. నీ మనసులో రగిలే ప్రశ్నలకు సమాధానం ఉందని కానీ నా మనసులో రగిలే ప్రశ్నలకు సమాధానం లేదు అని దీక్షితులు గారు లక్ష్మితో చెప్తారు. మిత్రకు ప్రతీ సారి గండం ఎదురైనప్పుడు ఏదో ఒక విధంగా తెలిసేది కానీ ఇప్పుడు రాబోయే ప్రమాదాన్ని తెలిపేది లేక పోరాడే మార్గం కనిపించడం లేదు అని అంటారు. మిత్రకు ఎదురవనున్న ప్రమాదం మన ఆలోచనలకు అందని భయంకర ప్రమాదమని దీక్షితులు గారు చెప్తారు. లక్ష్మి షాక్ అయిపోతుంది. మిత్ర జాతకం కాలిపోయిందని దాని అర్థం అమ్మవారి శక్తి కూడా ఆపదను ఆపలేదు అని అంటారు. 

లక్ష్మి: మిత్ర గారి సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం దొరకొచ్చు కదా.

దీక్షితులు: కళ్ల ముందు ఉన్నది భయంకరమైన ప్రమాదమైన నా పరిజ్ఞానంతో ఏదో ఒక మార్గం వెతుకుతాను. 

దేవయాని: గతంలో మనం దీక్షితులు గార్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాం. మర్చిపోయావా మనీషా. ఇప్పుడు మనకు ఆయన హర్రర్ సినిమా చూపిస్తారేమో. అదృష్టవశాత్తు అప్పుడు నా పేరు రాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తే శపించేస్తారేమో.

మనీషా: ఆంటీ నాకు అదే భయం. అసలు నన్ను ఆశ్రమంలోకి రానిస్తారా.

దేవయాని: ఆయన ముందు కొంచెం వినయం నటించు మిగిలింది నేను చూసుకుంటా. 

లక్ష్మి: అద్దంలో దేవయాని, మనీషాలను చూసి.. వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు. 

దీక్షితులు: మనీషా ఎందుకు వచ్చావ్. నీ గాలి కానీ కాలి దూళి కానీ నా ఆశ్రమానికి తాక కూడదు. పో ఇక్కడి నుంచి.

దేవయాని: దీక్షితులు గారు శాంతించండి. మనీషా చిన్న పిల్ల గతంలో చేసిన తప్పులను మీరు మనసులో పెట్టుకోకుండా మీ పెద్ద మనుసుతో క్షమించండి. 

మనీషా: నన్ను క్షమించండి దీక్షితులు గారు తప్పులన్నీ తెలుసుకొని మారిపోయి సామాన్య జీవితం గడుపుతున్నాను. దయచేసి గతాన్ని మనసులో పెట్టుకోకండి.

లక్ష్మి: మనీషా ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇది తన క్యారెక్టర్‌ కాదే.

దేవయాని వివేక్‌ పెళ్లి ఫిక్స్ చేస్తున్నాను అని జాతకం ఇచ్చి ముహూర్తం బాగుందో లేదో చూడమని అంటుంది. దీక్షితులు గారు జాను గురించి అడుగుతారు. దానికి దేవయాని జాను తనకు కోడలిగా రావడం ఇష్టం లేదు అని అంటుంది. ఇక లక్ష్మి గొంతు మార్చి తన బంధువుల్లో అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయడంతో పెళ్లి అయిన తెల్లారి పారిపోయాడు అని కోటీశ్వరుడని ఒక్కగానొక్క కొడుకు అని వీళ్లని కూడా ఆలోచించుకోమని చెప్పండని అంటుంది. దేవయాని కోపంతో అడ్డమైన సలహాలు వినదలచుకోలేదు అని మీరు ముహూర్తం గురించి చెప్పండి అని అంటుంది. ఇక దీక్షితులు గారు ఆ ముహూర్తాన్ని అద్భుతమైన ముహూర్తం అని ఎవరు ఆపినా పెళ్లి ఆగదని అంటారు. ఇక మనీషా లక్ష్మి బతికే ఉందా లేదా అని దీక్షితులు గారిని అడుగుతుంది. దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉందని చెప్తారు. సమయం సందర్భం వస్తే తానే మీకు ఎదురు పడుతుందని అంటారు. ఇన్‌ డైరెక్ట్‌గా మీ పక్కనే ఉందని అంటారు. ఇక మనీషా ముసుగు లేడీ లక్ష్మి తిరిగి వస్తుందా అని లక్ష్మినే అడుగుతుంది. దాంతో లక్ష్మి తిరిగి రాదు అని చెప్తుంది. ఇక దీక్షితులు గారు దేవయాని పెట్టిన ముహూర్తానికే వివేక్‌ పెళ్లి అవుతుందని కానీ నువ్వు ప్రయత్నిస్తే జానుతో అవ్వొచ్చని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పెళ్లి గురించి తల్లిదండ్రులకు క్లారిటీ ఇస్తానన్న కార్తీక్.. దీపకి కౌంట్‌డౌన్ స్టార్ అన్న నర్శింహ!

2024-06-29T04:43:04Z dg43tfdfdgfd