HAPPY BIRTHDAY SAMUTHIRAKANI: డైరెక్షన్‌ నుంచి యాక్షన్‌ వరకు, ఆల్‌ రౌండర్‌గా - సముద్ర ఖని గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Samuthirakani Birthday Specia: సముద్ర ఖని పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరభాష నటుడైన తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. తనదైన నటన, విలనిజంతో విలక్షణ నటుడిగా బిరుదుపొందారు. తమిళనాట నటదర్శకుడైన ఆయన 'అల వైకుంఠపురంలో', 'భీమ్లా నాయక్‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. విలన్‌గా, తండ్రి పాత్రల్లో తనదైన నటశైలితో మంచి గుర్తింపు పొందిన ఆయన నటుడిగా కంటే ముందే డైరెక్టర్‌ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అలా నటుడిగా, దర్శకుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటదర్శకుడు నేటితో 51వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఏప్రిల్‌ 26న సముద్రఖని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌, వ్యక్తిగత విషయాలపై ఓ లుక్కేయండి!

తమిళనాడు తెలుగు నేపథ్య కుటుంబం నుంచి..

1973 ఏప్రిల్‌ 26న తమిళనాడు ధాలవైపురంలో తెలుగు నేపథ్య కుటుంబంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం చేసిన ఆయన సొంతవూరు రాజపాలయంలో బీఎస్సీ చదివారు. ఆ తర్వాత మద్రాస్‌ అంబేద్కర్‌ లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1998లో డైరెక్టర్‌ కె.విజయన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. అదే టైంలో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్‌ తెరకెక్కిస్తున్న 100వ చిత్రం 'పార్తలే పరవశమ్‌' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అలా పలు చిత్రాలు, సీరియల్స్‌కి అసోసియేట్‌గా పనిచేయన ఆయన ఉన్నై చరణదైందేన్‌ చిత్రంలో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ స్వయంగా నటించి నిర్మించారు.

టాలంటెడ్‌ డైరెక్టర్‌గా 

ఆ తర్వాత దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ హీరోగా 'నెరంజ మనుసు', తెలుగులో పృథ్వీరాజ్ హీరోగా 'నాలో', రవితేజ 'శంభో శివ శంభో', నాని హీరోగా 'జెండాపై కపిరాజు' సినిమాలను తెరకెక్కించి ఆయన తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ వెంటనే అల్లరి నరేశ్ తో 'సంఘర్షణ' చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా రాని గుర్తింపు ఆయన నటుడిగా మంచి గుర్తింపు పొందారు. 'క్రాక్‌', 'అలవైకుంఠపురంలో', 'భీమ్లా నాయక్‌' వంటి చిత్రాల్లో పవర్ఫుల్‌ విలన్‌ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ప్రశాంత్‌ వర్మ 'హనుమాన్‌' చిత్రంలో విభూషణుడి పాత్రలో ఆకట్టుకున్నారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి విలక్షణ నటుడంటూ అభిమానుల చేత మన్ననలు అందుకుంటున్నారు.

ఇండస్ట్రలో ఆల్ రౌండర్ గా

ఇక సౌత్‌లో స్టార్‌ హీరోలకు విలన్‌ అనగానే డైరెక్టర్స్‌ అంతా సముద్ర ఖని వైపే చూస్తున్నారంటే ఆయన విలనీజం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో అర్థమైపోతుంది. ఇక ఆయన నటుడు, దర్శకుడే కాదు రచయిత కూడా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తమిళ్‌లో ఆయన రచన దర్శకత్వంలో వినోదాయసితం సినిమా రూపొందించి సూపర్‌ హిట్‌ కొట్టారు. అలా నటుడిగా, డైరెక్టర్‌గా, రచయిత మల్టీ టాలెంట్‌తో సముద్ర ఖని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. తనకు దగ్గర వచ్చిన పాత్రలకు న్యాయం చేసేందుకు పరితపిస్తారు. మరోవైపు తనకు తట్టిన వైవిధ్యమైన కథలకు సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. అలా తన తొలి దర్శకత్వంతో వచ్చిన వినోదయ సిథమ్‌ తమళ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంఇ. ఇదే సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో తీయాలనుకన్నారట. కానీ అది వర్క్‌ అవుట్‌ కాలేదు. మొత్తానికి నటుడిగా, డైరెక్టర్‌గా, రచయితగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఇలా ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్న ఆయన భవిష్యత్తులోనూ మరిన్ని సక్సెస్‌ అందుకోవాలని ఆశిస్తూ ఈ నటదర్శకుడికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

Also Read: పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న మృణాల్! - ఈ విషయంలో ఆ నటిని ఫాలో అవుతానంటున్న బ్యూటీ

2024-04-26T07:41:55Z dg43tfdfdgfd