KALKI 2898 AD : కల్కి చూశారా? మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?

పర్సనల్​ ఫైనాన్స్​, స్టాక్​ మర్కెట్​ ఇన్​వెస్ట్​మెంట్​ మీద ఇటీవలి కాలంలో ప్రజలు ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఫైనాన్షియల్స్​ని పెంచుకునేందుకు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్​ సినిమాలో అతిపెద్ద విషయంగా ఉన్న ప్రభాస్​ కల్కి 2898 ఏడీలోని క్యారెక్టర్స్​ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆర్థికపరమైన సూత్రాలు, విషయాలను ఇక్కడ చూసేయండి..

భైరవ- ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్స్ లాంటి వాడు..!

కల్కి 2898 ఏడీలో భైరవగా కనిపించాడు ప్రభాస్​. అతనొక బౌంటీ హంటర్​. క్రెడిట్స్​ని సంపాదించడం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. ఆ క్రెడిట్స్​తో ధనవంతులు ఉండే 'కాంప్లెక్స్​'కి వెళ్లాలన్నది భైరవ ఉద్దేశం.

భైరవ ఒక మల్టీటాలెంటెడ్ వ్యక్తి​. ఒక రోబోను సొంతంగా క్రియేట్​ చేసుకుంటాడు. తన గోల్​ని సాధించుకునేందుకు ఎంత దూరమైన వెళతాడు.

ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్స్​ కూడా ఇలాంటివే! భైరవలాగే, ఈ తరహా మ్యూచువల్​ ఫండ్స్​ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. మార్కెట్​ క్యాపిటలైజేషన్​తో సంబంధం లేదు. ఈ తరహ ఫండ్స్​ ద్వారా మనకి ఎక్కువ రిటర్నులు వస్తాయి.

సుమతి- స్మాల్​ క్యాప్స్​కి ఉదాహరణ..!

కల్కి 2898 ఏడీలో దీపిక పదుకొణె నటించిన క్యారెక్టర్​ పేరు సుమతి. ఆమె ప్రెగ్నెంట్​. ఆమె కడుపులో దేవుడు ఉన్నాడని, మానవజాతిని ఆ బిడ్డ రక్షిస్తుందన్నది నమ్మకం. స్మాల్​ క్యాప్​ ఫండ్స్​ కూడా ఇంతే!

ఏదో ఒక రోజు.. లార్జ్​ క్యాంప్​ని ఢీకొట్టేందుకు స్మాల్​ క్యాప్​ పనికొస్తుందనేది ఇన్​వెస్టర్ల నమ్మకం. ఇందులోని గ్రోత్​.. పెట్టుబడిదారులను అట్రాక్ట్​ చేస్తుంది.

అయితే.. స్మాల్​ క్యాప్​ ఫండ్స్​లోని రిస్క్​ని ముందే తెలుసుకోవాలి. అప్పుడే రక్షకుడు మనల్ని రక్షిస్తాడు!

అశ్వద్ధామ- లార్జ్​ క్యాప్​ ఫండ్స్​..

కల్కి 2898 ఏడీలో అశ్వద్ధామగా అమితాబ్​ బచ్చన్​ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సమతికి రక్షకుడిగా, భైరవతో పెద్ద యుద్ధమే చేస్తాడు అశ్వద్ధామ. ప్రపంచానికి రక్షకుడు ఎప్పుడు కావాలో, అప్పటివరకు ఎదురుచూసి తన పని మొదలుపెడతాడు.

లార్జ్​ క్యాప్స్​ పని కూడా ఇదే! మనం కోరుకునే టార్గెట్స్​ నెరవేరాలంటే, వాటి మీద మనకు నమ్మకం కలగాలంటే, లార్జ్​ క్యాప్స్​పైనే ఫోకస్​ చేయాలి. వాటికి ఉన్న సహనం అంతా ఇంతా కాదు. కానీ ఒక్కసారి అనుకున్నట్టు జరిగితే.. మంచి సంపదను సృష్టించుకోవచ్చు.

కాంప్లెక్స్​- ఇది మీ రిటైర్మెంట్​ టార్గెట్​!

కల్కి 2898 ఏడీలో కాంప్లెక్స్​కి వెళ్లేందుకు భైరవ చాలా సాహసం చేస్తాడు. తన పర్సనల్​ గోల్స్​ని నెరవేర్చుకునేందుకు ఎంతైనా కష్టపడాడు. కాంప్లెక్స్​లో సుఖంగా ఉండొచ్చు అనే ఇదంతా చేస్తాడు.

మనం కూడా ఇంతే! భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని, రిటైర్మెంట్​ ప్లాన్స్​ వేస్తాము. అందుకు తగ్గట్టు ఇన్​వెస్ట్​మెంట్స్​ చేస్తాము. వాస్తవానికి మనందరం ఈ విషయంలో భైరవలాగే ఉండాలి. మన భవిష్యత్తు కోసం ప్లాన్​ చేసుకోవలి.

- మనిషా లేఖి, ఫిల్మ్​ క్రిటిక్​

 

(గమనిక:- ఇవి రచయిత అభిప్రాయాలు మాత్రమే. హెచ్​టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

2024-06-29T07:04:36Z dg43tfdfdgfd