SUKUMAR: సుహాస్‌కి సుకుమార్ సాయం.. మేటర్ ఏంటంటే?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో సుహాస్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ప్రామిసింగ్ హీరో అనే పేరు తెచ్చుకున్నాడు సుహాస్. చేసే ప్రాజెక్టుల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ఇప్పుడు ప్రసన్నవదనం అనే చిత్రంలో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. ఈ చిత్రం మే 3న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లోని దసపల్లా కన్వెక్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి పుష్ప డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్టుగా వస్తుండటం మరో విశేషం.

క్రేజే వేరప్పా

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్ వస్తున్నారనే వార్తతో ఈ మూవీకి సోషల్ మీడియాలో సూపర్ బజ్ వస్తుంది. ఇక సలార్‌ ప్రాంఛైజీని తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్ సుహాస్‌ సినిమా పంపిణీ హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను హోంబలే ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేస్తున్నారు.

ఇలా టాప్ బ్యానర్లు ముందుకొచ్చి తన సినిమాలు కొనే స్థాయికి సుహాస్ రావడం చాలా గ్రేట్ అంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అర్జున్ వైకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ బల్గానిన్‌ కీలక పాత్ర పోషించారు. అలానే పాయల్ రాధాకృష్ణ, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, రాశీ సింగ్‌, నందు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మణికంఠ, ప్రసాద్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T10:31:55Z dg43tfdfdgfd