అదే ప్రపంచమన్న లేడీ ఫ్యాన్.. వెంటనే స్పందించిన మెగా హీరో

సోషల్ మీడియాలో హీరోలు యాక్టివ్‌గా ఉండటంతో అభిమానులకు ఈజీగా అందుబాటులోకి వచ్చేశారు. ఒకప్పుడు హీరోని చూడాలన్నా, మాట్లాడాలన్నా ఓ పెద్ద కలగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ అందుబాటులోకి వచ్చారు. హీరోలు సైతం తమ తమ అభిమానులతో టచ్‌లో ఉండాలని, వారికి మరింత దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల ట్వీట్లకు, పోస్టులకు స్పందిస్తుంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ సాయి ధరమ్ తేజ్‌ను ట్యాగ్ చేసి తన కోరికను బయటపెట్టేసింది.

తన బర్త్ డే అని..సాయి ధరమ్ తేజ్ గనుక తన బర్త్ డేకి విషెస్ చెబితే.. అదే నాకు ఎంతో గొప్ప.. అదే తనకు ప్రపంచంతో సమానం అని.. తన హీరో విషెస్ చెబుతాడని ఆశిస్తున్నానంటూ ఓ లేడీ ఫ్యాన్ ట్వీట్ వేసింది. దీనికి వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. సదరు అభిమానిని ఖుషీ చేశాడు.

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలి.. ఆనందంగా, సంతోషంగా ఉండాలి.. దయచేసి బాగా చదువుకుని నీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి అని కోరుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం మెగా హీరో వేసిన ఈ ట్వీట్ బాగానే వైరల్ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ చివరగా విరూపాక్షతో హిట్టు కొట్టాడు.

సత్య అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాగానే సందడి చేశాడు. కలర్స్ స్వాతి, సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరో ప్రస్తుతం గాంజా శంకర్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో రూమర్లు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదన్న సంగతి తెలిసిందే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T16:02:50Z dg43tfdfdgfd