నయనతారతో సినిమా చేయకుండా ఉండాల్సింది, తప్పు చేశా.. టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల  ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది.

టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల  ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన టేకింగ్ చాలా సహజసిద్ధంగా అనిపిస్తుంది. 

అయితే శేఖర్ కమ్ముల కూడా కెరీర్ లో కొన్ని ఊహించని ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు తన జడ్జిమెంట్ తప్పయింది అని శేఖర్ కమ్ముల అన్నారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  

గతంలో శేఖర్ కమ్ముల నయంతరతో అనామిక అనే చిత్రం చేశారు. అది రీమేక్ మూవీ. దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం చేయడం తప్పే అని శేఖర్ కమ్ముల అన్నారు. ఆ సమయంలో నిర్భయ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఆ టైమ్ లో హీరోయిన్ ఓరయెంటెడ్ సినిమా చేయాలనుకున్నా.

కథ లేకపోవడంతో అనామిక చిత్రాన్ని రీమేక్ చేసా. నయనతార లాంటి స్టార్ ఐతే బావుంటుంది అని ఆమెని తీసుకున్నాం. కానీ నయనతార లాంటి స్టార్ తో ఆ సినిమా చేసి ఉండకూడదు. ఆ టైంలో నిర్భయ సంఘటన వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా.

 

అదే విధంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కూడా వర్కవుట్ కలేదు అని శేఖర్ కమ్ముల తెలిపారు.ఆ విధంగా కొన్ని ప్రయోగాలు చేసి దెబ్బ తిన్నట్లు తెలిపారు. తను డబ్బు కోసమో.. ఈ ఎం ఐ కట్టడం కోసమో సినిమాలు చేయనని తెలిపారు.

ప్రయోగాలు చేసి విఫలం అయినప్పటికీ ..తాను లవ్ స్టోరీ తో సినిమా చేస్తే మాత్రం తిరుగు ఉండదు అని తెలిపారు. అలాగని ఎప్పుడూ ప్రేమ కథ చిత్రాలే చేయను అని అన్నారు. తనకి అనిపించి ప్రేమకథ రాస్తే అద్భుతంగా వస్తుంది అని తెలిపారు.

2024-06-29T08:12:05Z dg43tfdfdgfd