నిరుద్యోగులకు ఇండియన్ నేవీ గుడ్‌ న్యూస్.. టెన్త్ పాస్ అయితే చాలు

అప్రెంటిస్‌షిప్ అనేది కెరీర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. భవిష్యత్‌లో మంచి ఉద్యోగం పొందడానికి ఇది ప్లాట్‌ఫామ్‌గా చేస్తుంది. అప్రెంటిస్‌షిప్‌లో అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఇటీవల అనేక సంస్థలు అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి. తాజాగా నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ గుడ్‌న్యూస్ చెప్పింది. 10, 8వ తరగతి అర్హతతో అప్రెంటిషిప్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక పోర్టల్ indiannavy.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు మే 10న ముగుస్తుంది. ఇండియన్ నేవీ అప్రెంటిషిప్ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీలు భర్తీ అవుతాయి. అందులో ఫిట్టర్ 50 పోస్టులు, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ 35, మెకానిక్ 26, షిప్ రైట్స్ 18, వెల్డర్స్ 15, మెషినిస్ట్‌ 13, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 13, పైప్‌ఫిట్టర్స్ 13, పేయింటర్స్ 9, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్ 7 పోస్టులు, షీట్ మెటల్ వర్కర్స్ 3, టైలర్స్ 3, ప్యాట్రన్స్ మేకర్స్ 3, ఫౌండ్రీమ్యాన్ 1 పోస్ట్ భర్తీ కానున్నాయి.

వయోపరిమితి

ఇండియన్ నేవీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు కనీసం 14 నుంచి గరిష్టంగా 18 ఏళ్లకు మించకూడదు.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

నాన్-ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ట్రేడ్ రోల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 8వ తరగతి పాసై ఉండాలి. ఫోర్జర్, హీట్ ట్రీటర్స్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి.

ఫిజికల్ స్టాండర్ట్స్

దరఖాస్తుదారులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. కనిష్ట ఎత్తు 150 సెం.మీ, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 5 సెం.మీ ఛాతీ విస్తరణ, ఐ విజన్ 6/6 నుంచి 6/9 వరకు ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. రెండు దశలను క్లియర్ చేసినవారు అప్రెంటిస్‌షిప్‌‌కు అర్హులు.

స్టైఫండ్

ఇండియన్ నేవీ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ రూ.7,700 నుంచి రూ. 8,050 మధ్య లభిస్తుంది.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఇండియన్ నేవీ అధికారిక పోర్టల్ indiannavy.nic.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘ఇండియన్ నేవీ అప్రెంటిస్‌షిప్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి, దరఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

2024-04-24T13:13:51Z dg43tfdfdgfd