పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. హరిహర వీరమల్లు సీక్రెట్ రివీల్

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా ల్యాగ్ అవుతూ వస్తోంది. వాయిదా పడుతున్న షూటింగ్స్ చూసి ఇక ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అనుకున్న ఫ్యాన్స్‌కి సడెన్ గా టీజర్ వదిలి పూనకాలు తెప్పించారు మేకర్స్. ప్రస్తుతం హరిహర వీరమల్లు రిలీజ్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరో తీపి వార్త బయటకొచ్చింది.

టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబరు 20న లేదా క్రిస్మస్ రోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే బజ్ నడుస్తోంది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మేకర్స్ కూడా ధర్మం కోసం యుద్ధం 2024 అన్నారు గానీ ఈ మూవీ రిలీజ్‌పై మాత్రం అధికారిక ప్రకటన రాలేదని గమనించాలి.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారు. మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే.. వాళ్ళని దోచుకోడానికి ఓ దొంగ వస్తాడు అనే కాన్సెప్ట్ తో టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

అంతేకాదు హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుందని స్పష్టం చేశారు. ఈ భారీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కడుతున్నారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్, యానిమల్ ఫేమ్ బాబీ దేవోల్‌ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2024-05-03T08:03:29Z dg43tfdfdgfd