పాపాయి పుట్టాక అందంగా..

పురిటి నొప్పులను అమ్మ ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ, కాన్పు తర్వాత తనలో జరిగే మార్పులు ఆమెకు ప్రతి క్షణం సవాలుగా నిలుస్తాయి. డెలివరీ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ లాంటి హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. కండ్ల ముందే కరిగిపోతున్న అందాన్ని చూస్తూ ఆమె కుంగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఉన్నాయి. అలా కావొద్దంటే… ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ అనంతరం వచ్చే సమస్యలు, వాటిని అధిగమించే అవకాశాల గురించి తెలుసుకోవడం మంచిది..

డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. కాన్పు తర్వాత ఆరు నెలల నుంచి 12 నెలల వరకు ఈ సమస్య కనిపిస్తుంటుంది. మరోవైపు ఒత్తిడి, అలసట కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి. దీనికితోడు నిద్రలేమి సమస్య కారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. కండ్ల కింద వలయాలు ఏర్పడతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డెలివరీ తర్వాత శరీరం సాధారణ స్థితికి వచ్చాక చర్మం వదులవుతుంది. దీంతో స్ట్రెచ్‌ మార్కులు ఏర్పడతాయి.

  • కలబంద, యూకలిప్టస్‌ ఆయిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం పై మొటిమలు మాయమవుతాయి.
  • పసుపు-నిమ్మరసం, కలబంద, ఆలుగడ్డ గుజ్జు, కమలా పండ్ల తొక్కల పొడితో ఫేస్‌ ప్యాక్స్‌ను తయారు చేసుకొని, అప్పుడప్పుడూ వాడుతూ ఉండాలి. దీంతో చర్మ సౌందర్యం పెరుగుతుంది.
  • రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి. దీనివల్ల శారీరక బడలిక తీరడంతోపాటు కండ్ల కింద వలయాలు తగ్గుముఖం పడతాయి.
  • వైద్యుల సూచన మేరకు బ్రిస్క్‌ వాక్‌, యోగా వంటివి రెగ్యులర్‌గా చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.

2024-07-03T19:44:53Z dg43tfdfdgfd