మేలో మీ బర్త్‌డే ఉందా? ఒక వండర్‌లా టికెట్ కొంటే మరొకటి ఉచితం

మే నెలలో మీ బర్త్‌డే ఉందా? అయితే అలర్ట్. వండర్‌లా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఒక వండర్‌లా టికెట్ కొంటే మరో టికెట్‌ను ఉచితంగా ఇస్తోంది. వండర్‌లాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మే నెలలో పుట్టినవారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్‌లోని వండర్‌లాతో పాటు బెంగళూరు, కొచ్చిలోని వాటర్ పార్క్స్‌లో ఈ ఆఫర్ పొందొచ్చు. 2024 మే 31 వరకు ఈ ఆఫర్ లభిస్తుంది. ఆన్‌లైన్‌లో, పార్క్ టికెట్ కౌంటర్ల దగ్గర కొనే టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఆన్‌లైన్‌లో బయ్ వన్ గెట్ వన్ ఆఫర్ పొందాలనుకుంటే ముందుగా https://bookings.wonderla.com/ ఓపెన్ చేయాలి. పార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పుట్టిన తేదీ సెలెక్ట్ చేయాలి. అదే రోజుకు టికెట్ కొనాల్సి ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు ఇమెయిల్ ద్వారా టికెట్స్ వస్తాయి. పార్క్ దగ్గరా నేరుగా టికెట్ కొనొచ్చు. టికెట్ కౌంటర్ల దగ్గర ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఐడీ కార్డ్ చూపించి టికెట్ కొనొచ్చు. ఆ కార్డులో మీ పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. ప్రస్తుతం వండర్‌లాలో మే మంత్ ఆఫర్ నడుస్తోంది. మే నెలలో పుట్టినరోజు ఉన్నవారంతా బయ్ వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ పొందొచ్చు.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఇక వండర్‌లా ఇప్పటికే ఆర్‌టీసీ ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్‌టీసీ బస్సులో వండర్‌లా వెళ్తే పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం తగ్గింపు పొందొచ్చు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్‌లాకు టీఎస్ఆర్‌టీసీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించినవారు పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. వండర్‌లా టికెట్ కౌంటర్‌లో టీఎస్ఆర్‌టీసీ టికెట్స్ చూపించినవారికే డిస్కౌంట్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్స్ చేసినవారికి ఈ ఆఫర్ వర్తించదు.

Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

ఈ ఆఫర్ రెగ్యులర్ అడల్ట్, చైల్డ్ టికెట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఇతర కేటగిరీల టికెట్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. అదే రోజు ప్రయాణించిన టికెట్‌కు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. టికెట్‌లో డెస్టినేషన్ కూడా వండర్‌లా వరకే ఉండాలి. వండర్‌లా టికెట్స్‌పై ఇతర ఆఫర్స్ పొందాలనుకుంటే టీఎస్ఆర్‌టీసీ బస్ టికెట్ ఆఫర్ వర్తించదు. ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.

2024-05-06T06:59:59Z dg43tfdfdgfd