యడ్యూరప్పకు బిగ్ షాక్ .. చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

యడ్యూరప్పకు బిగ్ షాక్ .. చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

కర్ణాటక  మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప బిగ్ షాక్ తగిలింది.  మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఐడీ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోక్సో కేసులపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది . ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు ఈ ఏడాది మార్చిలో బీజేపీ అగ్రనేతపై వేధింపుల కేసు నమోదు అయింది. 

ఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్‌), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. అనంతరం ఈ కేసును సీబీఐకి బదిలీ అయింది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న టైమ్ లోనే బాధితురాలు తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించింది. 

మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ యడ్యూరప్ప ఖండించారు.  ఈ కేసుకు సంబంధించి సీఐడీ జూన్ 17న యడ్యూరప్పను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించింది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లైంగిక నేరాల చట్టం2012, లైంగిక వేధింపుల ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 354 A  కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-27T16:52:04Z dg43tfdfdgfd