రష్మికను తుపాకీతో భయపెట్టిన తెలుగు స్టార్ హీరో.. వీడియో వైరల్

ఉన్నట్టుండి రష్మిక మందన్నకు (Rashmika Mandanna) సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అందుకు కారణం ఆమెను ఓ స్టార్ హీరో తుపాకీతో భయపెట్టడమే. అంతా చూస్తుండగానే కెమెరా ముందే రష్మికను గన్ తో బెదిరించాడు ఆ హీరో. మరి ఆ హీరో ఎవరు? రష్మికను తుపాకీతో ఎందుకు బెదిరించాడు అనేది ఇప్పుడు చూద్దాం.

హీరో నాని (Hero Nani).. రష్మిక మందన్నను గన్ తో బెదిరించాడు. వీరిద్దరూ కలిసి దేవదాసు అనే సినిమాలో నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోని ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో నాని, రష్మికను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగారు. అదేసమయంలో నాగార్జున కూడా.. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య, నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు. దీంతో రష్మిక తడబడుతుంటే నాని అక్కడే టేబుల్‌పై ఉన్న గన్‌తో ఆమెను బెదిరించారు. దీంతో వెంటనే నాని పేరు చెప్పేసింది రష్మిక. ఇదే వీడియో చాలారోజుల తర్వాత ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కెరీర్ పరంగా చూస్తే రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అయింది. కెరీర్ తొలినాళ్లలోనే కుర్రకారు పల్స్ పట్టేసి వెండితెరపై అందాల గాలం వేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ అమ్మడికి బోలెడన్ని ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాతో బిజీ హీరోయిన్ అయింది. కెమెరా ముందు తనదైన ప్రతిభ కనబర్చుతూ నేషనల్ క్రష్ గా క్రేజ్ కొట్టేసింది రష్మిక.

నాగ చైతన్య- సమంత విడాకుల రీజన్.. ఫోన్ ట్యాపింగ్ వల్లే ఇంత జరిగిందా..? సంచలన విషయాలు

తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు రష్మిక కెరీర్‌కి పూల బాటలు వేశాయి. టాప్ డైరెక్టర్లు సైతం తన డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసిన ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ సాధించిన రష్మిక.. రెమ్మ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. దీంతో పాటు యాడ్స్, సోషల్ మీడియా ద్వారా సైడ్ ఇన్ కమ్ జెనెరేట్ చేసుకుంటోంది రష్మిక మందన్న.

2024-03-28T07:13:35Z dg43tfdfdgfd