సన్నీడియోల్‌ జాట్‌

సన్నీ డియోల్‌ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా హిందీ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే కావడం, సన్నీడియోల్‌ వంటి అగ్ర హీరో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జాట్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారని తెలిసింది.

ఈ సినిమాలో సన్నీడియోల్‌ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని, కథానుగుణంగా టైటిల్‌ను పెట్టారని అంటున్నారు. సెప్టెంబర్‌లోగా ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారని సమాచారం. సయామీఖేర్‌, రెజీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, సంగీతం: తమన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, రచన-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

2024-06-28T21:21:54Z dg43tfdfdgfd