హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓదెల 2 చిత్రం యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభం

తమన్నా ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది కథను అందించిన ఈ చిత్రానికి  అశోక్ తేజ దర్శకుడు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌’ చిత్రానికి  సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని,  దీనికోసం తమన్నా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుందని మేకర్స్ తెలియజేశారు.  ఇది సినిమాకు అత్యంత కీలకమైన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ అని అన్నారు. 

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ  చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. ఇందులో  ‘భైరవి’ నాగ సాధువుగా తమన్నా కనిపించనుంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మధు క్రియేషన్స్,  సంపత్ నంది టీమ్‌‌‌‌‌‌‌‌వర్క్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లపై డి.మధు  నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-29T04:13:04Z dg43tfdfdgfd