VENKATESH | వెంక‌టేశ్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం కుదిరినట్టే..!

Venkatesh | టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంక‌టేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవబోతుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. జులై 3న ఈ మూవీ ముహూర్తపు సెర్మనీ ఉండనుంది. అంతేకాదు మూవీ రెగ్యులర్‌ షూట్‌ కూడా ఇదే వారం షురూ కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్‌ కాదట. ఇదే నిజమైతే వెంకీ మామ ఈ సారి సోలోగా వినోదాన్ని పంచేందుకు రెడీ అవడం ఖాయమైనట్టేనన్నమాట. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

వెంకటేశ్‌ సినిమాలు అంటే కామిక్‌ స్టైల్‌ ఆఫ్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటాయి. ఈ స్టార్ యాక్టర్‌తో ఇప్పటికే ఎఫ్‌2, ఎఫ్ 3 సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే కామెడీని పండించాడు అనిల్ రావిపూడి. ఇక మరోసారి వెంకీ, అనిల్ సినిమా వస్తుందంటే పొట్టచెక్కలయ్యే నవ్వుల పూవులు పూయించడం గ్యారంటీ అని అప్పుడే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ చిత్రంలో కథానుగుణంగా మరో ఫీ మేల్‌ లీడ్ రోల్‌ కూడా ఉండగా.. ఆ రెండో హీరోయిన్‌ను వెతికే పనిలో పడిందన్న వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read Also :

Sudheer Babu | సుధీర్‌ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌

Double iSmart | ఊరమాస్‌గా రామ్‌ డబుల్ ఇస్మార్ట్‌ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్

Thalapathy 69 | విజయ్‌ దళపతి 69 హీరోయిన్‌ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!

Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మూవీ!

2024-07-01T14:47:54Z dg43tfdfdgfd