RAVI KISHAN: నేను రవి కిషన్ కూతురిని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి - ‘రేసు గుర్రం’ విలన్‌పై ఆరోపణలు

Ravi Kishan Daughter: తెలుగు, హిందీ, భోజ్‌‌పూరీ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు రవి కిషన్. తాజాగా ఈ నటుడిపై ఓ అమ్మాయి.. షాకింగ్ ఆరోపణలు చేసింది. తాను రవి కిషన్ కూతురిని అని చెప్తూ ఒక వీడియోను విడుదల చేసింది. అంతే కాదు.. తన తల్లిని కూడా అందరి ముందుకు తీసుకొచ్చింది. వారిద్దరూ కలిసి ఈ విషయాన్ని నిరూపించడానికి ఎంత దూరం అయినా వెళ్తామంటూ అందరినీ ఎదిరించడానికి సిద్ధమయ్యారు. సీనియర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రేక్షకులు షాకవుతున్నారు. అసలు ఇందులో నిజముందా అంటూ చర్చించుకుంటున్నారు.

సీఎంకు రిక్వెస్ట్..

ముందుగా షినోవా అనే ఒక అమ్మాయి తాను యాక్టర్, పొలిటీషియన్ రవి కిషన్ కూతురిని అంటూ వీడియో విడుదల చేసింది. అంతే కాకుండా ఈ వీడియోలో తాను రవి కిషన్ కూతురినే అని నిరూపించుకోవడానికి తనకు కొంత సమయం కావాలి అంటూ, కచ్చితంగా ఆధారాలతో తమ ముందుకు వస్తామంటూ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రిక్వెస్ట్ చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో మీడియా అంతా అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి షినోవాను కలిసింది. అదే సమయంలో షినోవా తల్లిని అంటూ అపర్ణ అనే మహిళ మీడియాతో మాట్లాడింది. తన కూతురు.. తన హక్కుల కోసం పోరాడుతుంది, దానికి తాను సపోర్ట్‌గా ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది.

ఆధారాలు ఉన్నాయి..

ఇంతకు ముందు పలువురు నటుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఇది కూడా అలాంటిదే అని చాలామంది రవి కిషన్‌పై వస్తున్న ఆరోపణలను నమ్మడానికి సిద్ధంగా లేరు. కానీ అపర్ణ మాత్రం ఇదంతా నిజమేనని, కచ్చితంగా న్యాయం కోసం కోర్టు వరకు కూడా వెళ్తానని అన్నారు. రవి కిషన్‌ను పర్సనల్‌గా కలిసినప్పుడు షినోవాను కూతురిగా ఒప్పుకున్నాడని కానీ పబ్లిక్‌గా మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదని తెలిపారు. 1996లో రవి కిషన్‌కు, తనకు స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగిందని, అందరి ముందు తనకు తాళి కట్టాడని చెప్పారు. ఇక రవి కిషన్‌తో తాము దిగిన ఫోటోలు కూడా ఉన్నాయని అన్నారు అపర్ణ.

కూతురిగా ఒప్పుకోవాలి..

రవి కిషన్‌తో మాత్రమే కాకుండా తన కుటుంబంతో కూడా పలు ఫోటోలు, వీడియోలు ఉన్నాయని అపర్ణ మీడియాతో తెలిపారు. అవన్నీ తాను కోర్టులో చూపిస్తానని అన్నారు. ప్రపంచం ముందు ఈ నిజాన్ని ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. షినోవాను తన కూతురిగా భావించి తనకోసం ఏదైనా చేస్తే బాగుంటుందని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు బాలీవుడ్‌లో సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ అటు పొలిటీషియన్‌గా, ఇటు యాక్టర్‌గా తీరిక లేకుండా గడిపేస్తున్నారు రవి కిషన్. ఈయన తెలుగులో కూడా ‘రేసుగుర్రం’లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై రవి కిషన్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Also Read: ఎన్నికల ప్రచారంలో హీరోయిన్ నమిత - పూల వర్షం కురిపించిన స్థానికులు, వీడియో వైరల్‌

2024-04-17T12:35:21Z dg43tfdfdgfd