అలాంటి వాడే భర్తగా కావాలి : తెలుగు హీరోయిన్ అనన్య కామెంట్స్ వైరల్..

Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఆ మధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. Photo : Instagram
ఆ సినిమా ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో అదరగొడుతోంది. అనన్య , సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలంలో ఓ కీలకపాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది..  Photo : Instagram
ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ తంత్ర(Tantra) ఆ మధ్య విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక ఈ సినిమాతో పాటు అనన్య మరి కొన్ని సినిమాలలో నటిస్తోంది. అది అలా ఉంటే.. ఒక ఇంటర్వ్యూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాల గురించి అనన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త హాయ్ నాన్న సినిమాలో నాని క్యారెక్టర్ లాంటీ వ్యక్తిత్వం ఉండాలనీ.. హ్యాపీగా ఫ్రెండ్స్‌లా ఉండాలని చెప్పింది. Photo : Instagram
ఇక ఈ భామ నరేష్, పవిత్ర లోకేష్‌లు జంటగా నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనన్య అందాల ఆరబోత చేసిన పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక అది అలా ఉంటే అనన్య ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నారు నెటిజన్స్. కొంతమంది నెటిజన్స్ మాత్రం అందంగా కనిపించడం కోసం అనన్య సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయంలో నిజం ఎంతో.. Photo : Instagram
అనన్య వకీల్ సాబ్‌తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో (Nithiin Maestro) అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. Photo : Instagram
అనన్య వకీల్ సాబ్‌తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో (Nithiin Maestro) అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే ఓటీటీలో విడుదలై ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram
ఇక 'మాస్ట్రో' డిజిటల్ రిలీజ్ హక్కులను హాట్ స్టార్ (Hotstar )  సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.35 కోట్ల మొత్తానికి డీల్ అయినట్టు టాక్. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించారు. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించింది. Photo : Instagram
ఈ సినిమా ఒరిజినల్‌ అంధధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలకపాత్రలో కనిపించింది. Photo : Instagram
ఇక అనన్య నాగళ్ల పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, అనన్య చదువుల కోసం ఆమె కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. అనన్య ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తన బి. టెక్ పూర్తి చేసింది. ఇక చిత్ర పరిశ్రమలో రాకముందు ఇన్ఫోసిస్‌లో పనిచేసిందని తెలుస్తోంది. . Photo : Instagram
అలా అక్కడ పనిచేస్తూ ఉండగా.. మల్లేషం సినిమాలో అవకాశం వచ్చింది. నటుడు ప్రియదర్శితో కలిసి నటించిన మల్లేశంలో మంచి నటనతో అదరగొట్టింది. ఇక ఆ తర్వాత 2021లో ప్లే బ్యాక్‌ సినిమాలో కనిపించింది. అదే సంవత్సరంలో ఆమె హిందీ చిత్రం పింక్ రీమేక్ వకీల్ సాబ్‌లో నటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. Photo : Instagrama

2024-03-28T11:59:31Z dg43tfdfdgfd