BRAHMAMUDI TODAY జూన్ 29 ఎపిసోడ్: ‘రేయ్ సుబ్బూ.. నీ కూతుర్ని తీసుకుని పోరా’ కవి ఆవేశం!‘రోడ్డుకు ఈడుస్తా’ అనామిక శపథం..

Brahmamudi Today: ద్యావుడా.. కవిని డబ్బుకోసం వలలో వేసుకున్న అనామిక.. చివరికి.. కవి కుటుంబాన్ని.. దుగ్గిరాల వంశాన్ని వీధికి లాగుతాను అని చెప్పి మరీ.. శపథం చేసి మరీ.. పోయింది. ఇక కవికి విడాకులు రావాలంటే.. కళావతి మళ్లీ రంగంలోకి దిగాల్సిందే. అనామిక నిజస్వరూపం మాత్రం ఇంట్లో అందరికీ కళ్లకు కట్టినట్లు తెలిసింది. నేటి కథనం అదిరిపోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)

Brahmamudi 2024 june 29 Episode: రుద్రాణీ మాట విని.. తల్లిదండ్రులను పంచాయితీకి పిలిచిన అనామిక.. వాళ్లు రాకముందే కవిని కెలుకుతుంది. పాపం కవి ఉదయాన్నే లేచి.. బాధగా గదిలో చీకటిలో ఒంటరిగా కూర్చుని ఉంటే.. కావ్య వెళ్లి.. ధైర్యం చెప్పి.. భార్య భర్తల బంధం గురించి గొప్పగా చెప్పి కిందకు తీసుకొస్తుంది. తీరా కిందకు వచ్చాక.. అపర్ణా దేవితో.. ‘పెద్దమ్మా ఈ సమస్యలతో గొడవలతో మీరు చాలా ఇబ్బందిపడుతున్నారని నాకు తెలుస్తోంది. ఇదంతా ఉండకూడదు అంటే’ అని కవి మాట పూర్తి చెయ్యకుండానే అనామిక అందుకుంటుంది. ‘నాకు విడాకులు ఇవ్వాలి అంతే కదా? కారణాలన్ని అయిపోయి.. ఇప్పుడు మీ పెద్దమ్మను కారణంగా చూపించి విడాకులు ఇస్తావా?’ అంటూ రెచ్చిపోతుంది అనామిక. అప్పుడే అప్పూ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆ మాటలతో కవికి కోపం వచ్చి కొట్టడానికి చేయి ఎత్తి.. ఆవేశాన్ని ఆపుకుంటూ ఆగుతాడు. సరిగ్గా అప్పుడే సుబ్బూ, శైలు ఎంట్రీ ఇస్తారు.అనామిక ఓవర్ యాక్షన్..

‘ఆగిపోయావేం బాబు కొట్టు’ అంటాడు సుబ్బూ లోపలికి వస్తూ. అతడి వెంటే నడిచిన శైలు.. ఆవేదనగా ‘కొట్టి కొట్టి చంపెయ్యండి దాన్ని’ అంటుంది. వెంటనే అనామిక.. నాన్నా అంటూ తండ్రి దగ్గరకు పరుగుతీసి.. గుండెలపై వాలి.. ‘వీళ్లంతా నన్ను నానా మాటలు అంటున్నారు’ అంటూ చాడీలు చెప్పినట్లుగా చెబుతుంది. నిర్ఘాంతపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ. ‘దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఏదో గొప్ప ఫ్యామిలీ అనుకున్నాం. కానీ కోడళ్లను కొట్టి చంపేసే ఫ్యామిలీ అనుకోలేదు’ అంటాడు సుబ్బూ కోపంగా.

స్వప్న అంచనా..

వెంటనే రాజ్ ఊరుకోడు. ‘ఏమయ్యా పెద్ద మనిషి.. ఏం మాట్లాడుతున్నావ్ అయ్యా? ఇక్కడ నీ కూతురు ఎంత రుద్రతాండవం చేస్తుందో నీకు తెలుసా? దుగ్గిరాల ఫ్యామిలీ గురించి మాట్లాడతావేంటీ? ఆ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు’ అంటాడు రాజ్ కోపంగా. ‘నాన్న రాజ్ ఎంతైనా వాళ్లు ఈ ఇంటికి పిల్లనిచ్చిన వాళ్లు రా..’ అంటాడు సీతారామయ్య. ‘పిల్లనిచ్చినవారు పిలిచినప్పుడే వస్తారు.. అంతే కానీ ఇలా పిలవకపోయినా వస్తారా? వీళ్లని వీళ్ల కూతురే పిలిచి ఉంటుంది’ అంటుంది స్వప్న కోపంగా.

ద్యావుడా.. అనామిక పొగరు..

‘అవును.. పిలిచాను.. నేనే పిలిచాను’ అంటుంది పొగరుగా అనామిక. ఆమె మాటలకు కూర్చున్న నలుగురు పెద్దలు (ఇందిరా దేవి, సీతారామయ్య, అపర్ణా, సుభాష్) కూడా లేని నిలబడతారు. ‘ఎందుకు పిలిచావో తెలుసుకోవచ్చమ్మా?’ అంటాడు ప్రకాశం. ‘మీ అబ్బాయి నాకు విడాకులు ఇస్తా అన్నాడు కాబట్టి..’ అంటుంది అనామిక. ‘ఎందుకు విడాకులు ఇస్తా అన్నాడో నీకు తెలియదా అమ్మా?’ అంటాడు ప్రకాశం. ‘ఏ.. మీకు మతిమరపు సమస్య ఉందని లోకంలో ఉన్న అందరూ బుర్ర తక్కువ మనుషులే ఉంటారని మీరు అనుకుంటున్నారు?’ అంటుంది అనామిక కోపంగా.

చిన్నబుచ్చుకున్న ప్రకాశం..

ఆ మాటలకు అంతా బిత్తరపోతారు. పాపం ప్రకాశం చిన్నబుచ్చుకుంటాడు. కవి వెంటనే.. ‘అనామికా.. ఇది అసలు మనిషేనా వదినా?’ అంటాడు బాధగా. వెంటనే ధాన్యం కోపంగా.. ‘హేయ్ ఏం అన్నావ్.? ఆయన ఎవరు అనుకున్నావ్? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?’ అంటుంది కోపంగా. వెంటనే ఇందిరా దేవి మొదలుపెడుతుంది. ‘ఇప్పటి దాకా మీ అమ్మాయిని చిన్న పిల్ల అనుకున్నాం. గారాబంగా పెరిగి ఉంటుంది కదా అనుకున్నాం. మా కళ్లు తెరిపించింది. ఈ రోజే తెలిసింది మీ అమ్మాయి అసలు స్వరూపం ఏంటో? అయినా మీ దాకా మేము తీసుకుని రాలేదు..

అస్సలు తగ్గని అనామిక.. సంబరంగా రుద్రాణి..

కానీ అది కూడా మా తప్పే అని తెలిసేలా చేసింది.. తప్పు తను చేసి మిమ్మల్ని పిలిచింది అంటేనే అర్థమవుతుంది. ఏం చేసినా చెల్లుతుందనుకుంటుందేమో.. ఏదైనా చేస్తే చెల్లని నాణెంగా మారుతుంది నీ కూతురు బతుకు’ అంటుంది ఇందిరా దేవి కోపంగా. ‘ఏంటమ్మా ఇది.. మేము మాట్లాడటానికే కదా వచ్చాం.. పెద్దవాళ్లను పట్టుకుని అలా మాట్లాడొచ్చా?’ అంటూ అనామికను మందలిస్తాడు సుబ్బూ తప్పక. అయినా అనామిక తగ్గదు. ‘నేను ఏమైనా లేని మాట అన్నానా? ఉన్నదే కదా అన్నాను..’ అంటుంది పొగరుగా. రుద్రాణి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ వేడుకలా చూస్తుంది ఆ గొడవను.

అనామిక పితూరీలు..

వెంటనే స్వప్న కోపంగా.. ‘అనామికా.. చెప్పు చెంప మీద తెగుద్ది. ఏంటో భరితెగించి మాట్లాడుతున్నావ్? ఏమయ్యా ఇలాగేనా నీ కూతుర్ని పెంచేది. ఏమే పేడ తట్ట ముఖం దానా.. ఒక్కసారి అంటే ఊరుకున్నారు కదా అని.. మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడితే మీ ముగ్గురి ముఖాన పేడ కొట్టి గెంటేస్తాను’ అంటుంది. ‘విన్నారా అమ్మా.. విన్నారా నాన్నా.. ఇది ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో మీ కూతురు వెలగబెట్టే కాపురం.. ఇక్కడ నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూశారా?’ అంటుంది అనామిక కావాలని. వెంటనే కావ్య ఊరుకోదు.

పిల్లకాకి వెటకారం..

‘అనామికా.. నువ్వు ఒకే ఒక్క నిమిషం నువ్వు మాట జారకుండా ఉండి ఉంటే.. కవిగారు నీతో మనసు విప్పి మాట్లాడదామనే వచ్చారు’ అంటుంది కావ్య. ‘ఓహో.. ఆయన నువ్వు చెబితే మాట్లాడటానికి వచ్చారా? ఎంతైనా తను మోజుపడ్డ ఆడదానికి అక్కవి కదా.. నీ మాట కచ్చితంగా వింటాడులే’ అంటుంది అనామిక. ‘విన్నారుగా.. ఇది మీ కూతురు వ్యవహారం. చాలా ఎక్కువ చేస్తుంది. నా కాపురం బాగుండాలని ఎంతగానో నాకు నచ్చజెప్పిన మా వదినని ఎలా తూలనాడిందో విన్నారు కదా?’ అంటాడు కవి.

స్వప్న చురకలు..

‘బేబీ ఆగు... నేను మాట్లాడుతాను కదా.. నువ్వు ఆగు.. కాస్త నిదానంగా ఉండు. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి..? అన్ని మరిచిపోయావా? నువ్వు ఆగు నేను మాట్లాడతాను’ అంటుంది శైలు. ‘ఏంటి మీ బేబీకి చాలా కష్టాలొచ్చాయా? చాలా బాధలున్నాయా? దానికి తిని కూర్చోలేక బాగా బలిసి..’ అంటూ స్వప్న మాట పూర్తికాకుండానే.. ధాన్యం అందుకుంటుంది. ‘నువ్వు ఆగు స్వప్నా...’ అంటూనే.. ‘ఏమ్మా.. నీ కూతురికి ఈ ఇంట్లో కష్టాలున్నాయా? బాధపడుతుందా? చెప్పమను.. తన వల్ల మా ఇంటి పరువు పోతుందా? మా వల్ల తను ఇబ్బంది పడుతుందా?’ అంటుంది కోపంగా.

అనామిక తండ్రి కూడా తప్పుడు మాటలు..

వెంటనే ప్రకాశం.. కోపంగా.. ‘చూడండి.. ఇప్పటి వరకూ మేమంతా ఇది భార్యభర్తల సమస్య అనుకున్నాం. కానీ ఈ ఇంటి పరువు మర్యాదలకు సంబంధించిన సమస్యగా మారింది. ఇక నుంచైనా మీ అమ్మాయి నోటిని, ప్రవర్తనను అదుపులో పెట్టుకుని ఉండమని చెప్పండి.. మా అబ్బాయి మేము సద్దిచెప్పుకుంటాం’ అంటాడు ప్రకాశం. ‘ఇంత మంది మా అమ్మాయినే తప్పుబడుతున్నారు.. మరి మీ అబ్బాయి ఇంకోదానితో కులుకుతున్నాడు కదా? దానికి ఎలా ఉంటుంది?’ అంటాడు సుబ్బూ కోపంగా. వెంటనే స్వప్న రెచ్చిపోతుంది.

కనకం పెద్ద కూతురు ఆవేశం..

‘హేయ్ ఏం అంటున్నావ్?’ అంటూ మీద మీదకు వెళ్లిపోతుంటే.. ఇటు రుద్రాణి.. అటు రాహుల్ ఆపుతుంటారు. ‘మీరు ముగ్గురూ మనుషులేనా? మిమ్మల్ని అసలు చంపేస్తాను..’ అంటూ రెచ్చిపోతుంది స్వప్న వాళ్ల మీద. ‘అక్కా అక్కా నువ్వు ఆగు అక్కా నువ్వు ఆగు..’ అంటూ కావ్య అందుకుంటుంది. ‘అనామికా.. వచ్చినవాళ్లు మర్యాద కాపాడుకుంటే మంచిది’ అంటుంది కోపంగా కావ్య. ‘ఇప్పుడు అర్థమైంది. మీ కూతురు ఎందుకు ఇలా పుట్టిందో.. మీకు సంస్కారం ఉంటే కదా.. మీ కూతురికి సంస్కారం వచ్చేది’ అంటాడు కవి కోపంగా.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-29T04:20:38Z dg43tfdfdgfd