BANDLAGUDA | బండ్లగూడలో రెచ్చిపోయిన మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు

హైదరాబాద్‌ : బండ్లగూడ(Bandlaguda) మాజీ మేయర్ మహేందర్ గౌడ్(Mahender Goud) అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మేయర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో అడ్డుకున్న కార్పొరేటర్లపై మహేందర్ గౌడ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. పిడుగుద్దుల వర్షం కురిపించారు.

ఎమ్మెల్యే ఎదుటే రాజకీయ నాయకులు రౌడీలుగా మారి కొట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా ఒకటో వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ అంగి చింపివేసి బండబూతులు తిడుతూ కులం పేరుతో దూషించారు. ఐదో వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్‌ రెడ్డతో పాటు పలువురిపై గుండాలు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2024-06-30T09:18:52Z dg43tfdfdgfd