MRUNAL THAKUR | ప్రభాస్‌ తల్లిగా మృణాళ్‌ ఠాకూర్‌.. నిజంగా అంతధైర్యం చేసిందా?

Mrunal Thakur | సీతారామం, హాయ్‌ నాన్న విజయాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మృణాళ్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ అందాలభామ ‘పూజా మేరీ జాన్‌’ అనే బాలీవుడ్‌ సినిమా మాత్రమే చేస్తున్నది. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగులో మాత్రం ఏ సినిమాకీ ఓకే చెప్పలేదు. అయితే.. ప్రభాస్‌ ‘కల్కి 2898ఏడి’లో మృణాల్‌ ఓ ప్రత్యేకమైన పాత్ర పోషించినట్టు తాజా సమాచారం.

ఇందులో భైరవగా ప్రభాస్‌ నటించిన విషయం తెలిసిందే. భైరవ తల్లి పాత్రను ఇందులో మృణాళ్‌ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్‌ పాత్ర కనిపిస్తుందని తెలుస్తున్నది. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉండి కూడా ఇలా ప్రభాస్‌కి తల్లిగా నటించడం నిజంగా గ్రేట్‌ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. ఈ విషయాన్ని ‘కల్కి’ టీమ్‌ అధికారికంగా ప్రకటించలేదు. ప్రచార చిత్రాల్లో కూడా ఎక్కడా మృణాళ్‌ జాడ లేదు. అయితే.. సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

2024-06-24T22:21:22Z dg43tfdfdgfd