PUSHPA 2: పుష్ప పుష్ప పుష్పరాజ్... బన్నీ కోసం డీఎస్పీ మార్క్ ట్యూన్, 'పుష్ప 2' ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule). ఉత్తమ నటుడిగా ఆయనకు జాతీయ పురస్కారం తెచ్చిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ ఇది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలువురు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డేకి ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. 

పుష్ప... పుష్ప... పుష్పరాజ్...

దేవి శ్రీ ప్రసాద్ మార్క్ సాంగ్ రెడీ!

'పుష్ప'కు రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ సినిమా సీక్వెల్ 'పుష్ప 2' కోసం మరోసారి తన మార్క్ సాంగ్స్ రెడీ చేశారు డీఎస్పీ. పుష్ప... పుష్ప... పుష్పరాజ్... అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమో ఇవాళ విడుదల చేశారు. మే 1న ఉదయం 11.07 గంటలకు ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా

138 గంటల పాటు ట్రెండింగ్‌లో టీజర్

'పుష్ప 2' కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారు? ఈ సినిమాకు ఆదరణ ఎలా ఉంది? అనేది చెప్పడానికి టీజర్ రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. విడుదల చేసిన క్షణం నుంచి నాన్‌ స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్ వన్‌ స్థానంలో ట్రెండింగ్‌ అయ్యి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' విడుదల

'పుష్ప' సినిమా 2021లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. హీరో అల్లు అర్జున్ కెరీర్ మొత్తంలో అతి పెద్ద విజయంగా నిలిచింది. దానికి సీక్వెల్ కావడంతో 'పుష్ప 2' మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Also Readశబరి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తల్లి పాత్రలో వరలక్ష్మి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ పాత్రలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ మరోసారి విలనిజం చూపించనున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్, సీఈఓ: చెర్రీ,ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, నిర్మాణం: నవీన్ ఎర్నేని - వై రవిశంకర్, కథ - కథనం - దర్శకత్వం: సుకుమార్ .బి.

2024-04-24T11:19:38Z dg43tfdfdgfd