ఇంటర్ ఫలితాలలో.. దుమ్ము లేపిన కూలీ కూతురు !

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు విద్యార్థులు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల లో ఎందరో ఉత్తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ర్యాంకులను సాధించారు. వీరిలో ఎందరో సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థులు సైతం ఉన్నారు. అలాగే ఈ ఫలితాలలో సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు సైతం బెస్ట్ ర్యాంక్స్ సాధించి శభాష్ అనిపించుకున్నారు. వారిలో నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించిన స్రవంతి ఒకరు. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలలో 987 మార్కులతో స్రవంతి తన సత్తా చాటి ఉత్తమ ర్యాంకు సాధించింది.

స్రవంతి స్వగ్రామం వరంగల్ కాగా.. వీరి కుటుంబం సామాన్య కుటుంబమని చెప్పవచ్చు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా రాణిస్తూ, తమ కుమార్తె ఉన్నత చదువు చదివి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలనుకొని ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో చేర్పించారు. కళాశాలలో జరిగేటటువంటి ప్రతి పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించడంలో స్రవంతి ప్రత్యేక గుర్తింపు పొందింది.

రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

ఒక సామాన్య కుటుంబం నుండి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో విద్యను అభ్యసించేందుకు వచ్చిన స్రవంతి సెకండియర్ బైపీసీలో 987 మార్కులను సాధించడంపై కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ విద్యార్థిని బోటనీ లో 60, జువాలజీ లో 60, ఫిజిక్స్ లో 60, కెమిస్ట్రీ లో 60 బై కి బై మార్క్స్ సాధించడం తమ కళాశాలకే గర్వకారణమని వారు తెలిపారు.

Inter: స్వీపర్ కూతురు.. ఇంటర్‌లో స్టేట్ సెకండ్ ర్యాంక్... 

ఈ సందర్భంగా లోకల్18 తో స్రవంతి మాట్లాడుతూ.. తాను ఎప్పటికైనా డాక్టర్ కావాలన్నదే తన ముందున్న లక్ష్యం అన్నారు. దీనితో ఒక డాక్టర్ గా ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశమని స్రవంతి తెలిపింది. ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన స్రవంతి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని డాక్టర్ గా ప్రజలకు సేవ చేయాలని అందరం ఆశిద్దాం !

2024-04-27T16:41:26Z dg43tfdfdgfd