కమల్‌ హాసన్‌ ఇంట విషాదం, 'ప్రతినిధి 2' రిలీజ్‌ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!

Firing Outside Salman Khan House Case: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో భాగంగా ఇప్పటికీ ముంబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్తున్న వివరాల ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు గన్‌తో కాల్పులు జరిపిన తర్వాత ముంబాయ్ నుండి పారిపోవాలి అనుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా వారు ఉపయోగించిన గన్స్‌ను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Kamal Haasan Uncle Died: ప్రస్తుతం సినిమాలు, మరోవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యన్తిని కోల్పోయానంటూ తాజాగా కమల్‌ హాసన్‌ సోషల్‌ మీడియాలో వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తకి ఆయన ఎవరంటే కమల్‌ హాసన్‌ మామ, పీపుల్స్‌ జస్టీస్‌ సెంటర్‌ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ (92). కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం కొడైకెనాల్‌లో కన్నుమూశారు. పరమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్‌ గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. అనంతరం కొంతకాలంగా కొడైకెనాల్‌లో నివసిస్తున్న ఆయన నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని నేడు చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నారా రోహిత్ (Nara Rohit) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie). కొంత విరామం తర్వాత ఆయన నటించిన చిత్రమిది. దీనితో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ గురువారం (ఏప్రిల్ 25న) విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, ఈ రోజు సినిమా విడుదల వాయిదా పడినట్లు వెల్లడించారు.'ప్రతినిధి 2' విడుదల వాయిదా వేశామని, కొత్త విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే, వాయిదా వెయ్యడానికి గల కారణాలు వెల్లడించలేదు. వాయిదా పడటం వెనుక రాజకీయం ఉందని ఫిల్మ్ నగర్ గుసగుస. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రశాంత్ నీల్... ఇప్పుడీ పేరును ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా 'ఉగ్రం'తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన 'కెజియఫ్' సినిమాతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లారు. రాకీ భాయ్ పాత్రలో యశ్ (Hero Yash)ను ఆయన చూపించిన తీరుకు ప్రేక్షకులు క్లాప్స్ కొట్టారు. ఇక, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన 'సలార్' సైతం యాక్షన్ మూవీ లవర్స్‌కు విపరీతంగా నచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చెయ్యడానికి హీరోలు అందరూ రెడీగా ఉన్నారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. అయితే, ఆయన ఏ హీరోతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నారు? అంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Child Artist Nikhil Devadula: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులలో నిఖిల్ దేవాదుల కూడా ఒకడు. ఎంతోమంది స్టార్ హీరోలకు చైల్డ్ యాక్టర్‌గా నటించి యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరో అయ్యేంత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోలతో కలిసి నటించిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. అంతే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ మహేశ్ బాబు సినిమా నుండి తనను తొలగించారని బయటపెట్టాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

2024-04-23T11:45:59Z dg43tfdfdgfd