`కల్కి 2898 ఏడీ` రెండు రోజుల కలెక్షన్లు.. దుమ్ముదుమారం.. నిలబడుతుందా?

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు  ఏకంగా 191 కోట్ల గ్రాస్‌ సాధించింది. కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి` చిత్రాలను బీట్‌ చేయలేకపోయింది. ప్రారంభం నుంచి సినిమాకి పెద్దగా బజ్‌ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడిందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు వర్షాలు, టీ20 ప్రపంచకప్‌ మ్యాచులు కూడా కొంత ప్రభావం చూపించాయి. లేదంటే కచ్చితంగా ఇది రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించేది. గత రికార్డులను బ్రేక్‌ చేసేది. 

ఇదిలా ఉంటే రెండో రోజు ఈ మూవీ సత్తా చాటింది. కలెక్షన్ల ఊచకోత చూపించింది. ఏకంగా వంద కోట్లకుపైగా రెండో రోజు వసూలు చేయడం విశేషం. రెండు రోజుల్లో ఈ మూవీ 298.5కోట్లు సాధించింది. అంటే రెండో రోజు ఏకంగా 105కోట్లు వసూలు చేసింది. ఈ రేంజ్‌ వసూళ్లని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సినిమా స్టడీగా సాగుతుందని, డ్రాప్‌ తక్కువగానే ఉందని చెప్పొచ్చు. సహజంగా ఓపెనింగ్‌ రోజుతో పోల్చితే రెండో రోజు తగ్గుతుంది. అది కామన్‌గా జరిగేదే. అయితే ఈ వీకెండ్‌ నాలుగు రోజులుండటంతో సినిమా ఫస్ట్ వీక్‌లోనే భారీ స్థాయిలో చేసేది అంటున్నారు. మిగిలిన శని, ఆదివారాల్లో రెండో వందల కోట్లు వస్తే ఐదు వందల కోట్లకు చేరుకుంటుంది. ఆదివారం కలెక్షన్లు కొంత పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం రెండు రోజుల్లో ఈ మూవీ 298.5కోట్ల గ్రాస్‌, 150కోట్ల వరకు షేర్‌ వచ్చింది. ఈ మూవీ మొత్తంగా 370కోట్ల బిజినెస్‌ అయ్యింది. తెలంగాణ, ఏపీలో 168కోట్లు, కర్నాటక 25కోట్లు, తమిళనాడు 16కోట్లు, కేరళ ఆరు కోట్లు, నార్త్ 85కోట్లు, ఓవర్సీస్‌ 70కోట్ల బిజినెస్‌ అయ్యింది. మొత్తంగా 370కోట్ల బిజినెస్‌ అయ్యింది. బడ్జెట్‌లో సగం రిలీజ్‌కి ముందే వచ్చేశాయి. ఓటీటీ, శాటిలైల్‌, ఆడియో రూపంలో మరో నాలుగు వందల కోట్లు. అంటే రిలీజ్‌కి ముందే ఈ మూవీ నుంచి నిర్మాతలు సేఫ్‌ అయ్యారు. 

ఇక కొన్న బయ్యర్లు సేఫ్‌ కావాలంటే ఈ సినిమా సుమారు 750కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయాలి. మరి లాంగ్‌ రన్‌లో ఇది సాధ్యమవుతుందా అనేది చూడాలి. ఈ రెండు మూడు రోజులు వచ్చే కలెక్షన్లని బట్టి, సోమవారం నుంచి ఆడియెన్స్ ఆదరణని బట్టి ఈ సినిమా హిట్‌ అవుతుందా? బోల్తా పడుతుందా అనేది తెలుస్తుంది. కానీ ట్రేడ్‌ పండితులు ఈ మూవీ 800-1000కోట్ల వరకు రాబట్టే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. మహాభారతం ఎలిమెంట్లు మాత్రమే ఈ సినిమాని కాపాడతాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

 

2024-06-29T09:27:23Z dg43tfdfdgfd