దర్శన్ మర్డర్ కేసు పై సినిమాలు,టైటిల్స్ ఏంటంటే

హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 25 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో  బయటకొస్తున్న వార్తలు, వీడియోలు, ఫొటోలు దర్శన్ వీరాభిమానులకు కూడా విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శన్ మర్డర్ కేసు స్టోరీని అప్పుడే సినిమా చేయాలని కొంతమంది ఉత్సాహవంతులు బయిలుదేరారు.  ఈ మేరకు కొన్ని టైటిల్స్ కూడా అనుకున్నారు. వాటితో ఫిల్మ్ ఛాంబర్ ని ఎప్రోచ్ అయ్యారు. 

ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్ లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని కూడా పలువురు వచ్చారట. కన్నడ సినీ పరిశ్రమ సమాచారం ప్రకారం D గ్యాంగ్, D-Boss,ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ ఫిల్మ్ ఛాంబర్ లో  రిజిస్టర్ చేయాలని అనేకమందిని కోరారట. ఈ క్రమంలో దర్శన్ జీవితం, దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలయిన సంగతులు, ఇప్పటి హత్య కేసు కలిపి సినిమాలు తీయాలని కన్నడ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మరి దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో చూడాలి. 

మరో ప్రక్క కొందరు మాత్రం దర్శన్‌నే వెనకేసుకేసుకు రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది.  రీసెంట్ గా నటి సోను గౌడ ఆ జాబితాలోకి చేరింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది తిడతారని నాకు తెలుసు. కానీ ఒక్కసారి అభిమానం పెంచుకున్నాక అది ఎల్లప్పటికీ అలాగే ఉంటుంది. నేను దర్శన్‌కు అభిమానిని. ఆయన వల్ల లాభం పొందిన ఎంతోమంది ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. చాలామంది ఆయన్ను మోసం చేశారు కానీ ఆయన ఎన్నడూ ఇతరుల్ని మోసగించలేదు.

 

ఏ పాపం చేయకపోయినా నన్ను కూడా ఓసారి జైల్లో వేశారు. నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనే పెదవి విప్పాను. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. చాలామంది అమాయకుల జీవితం కూడా జైల్లోనే గడిచిపోతుంది. నిజంగా తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే! దర్శన్‌కు తమ్ముడిని, అన్నను, అంకుల్‌ను అంటూ చెప్పుకుతిరిగినవారంతా ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు అని చెప్పుకొచ్చింది. 

2024-07-01T02:49:16Z dg43tfdfdgfd