చిరంజీవికి ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌.. సీక్రెట్‌గా రాఘవేంద్రరావు చేసిన పనికి సురేఖ షాక్‌.. ఏం జరిగిందంటే?

చిరంజీవి, సురేఖలు ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌ చేసుకున్నారా? రాఘవేంద్రరావు వీరికి తెలియకుండా అంత పని చేశాడా? మెగాస్టార్‌ షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. 

మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కువగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాలతోనే కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే సూపర్‌ హిట్టే అనే టాక్‌ ఉంది. అంతగా ఓ క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు. అయితే ప్రారంభంలో చిరంజీవి కోసం రాఘవేంద్రరావు చేసిన పని ఆయన్ని ఆశ్చర్యపరిచింది. జీవితంలో బెస్ట్ మెమోరీగా నిలిచింది. ఆ విషయాన్ని చిరు పంచుకున్నారు. 

 

రాఘవేంద్రరావుతో ప్రారంభంలో సినిమాలు చేసే సమయంలోనే చిరంజీవికి పెళ్లి అయ్యింది. అప్పట్లో(1980) చిరంజీవి బిజీ ఆర్టిస్ట్‌. ఏడాదికి పది సినిమాలు రిలీజ్‌ చేస్తున్నాడు. హీరోగా ఎదుగుతున్న రోజులు. ఆయన కోసం దర్శకులు క్యూలో ఉన్న రోజులు. ఆ సమయంలోనే అల్లు రామలింగయ్య చిరంజీవితో మాట్లాడి తన కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి కూడా ఒకటి రెండు రోజుల గ్యాప్‌లోనే మ్యారేజ్‌ చేసుకున్నారు. కనీసం ఫస్ట్ నైట్‌ కి కూడా టైమ్‌ లేదు. 

 

పెళ్లి అయిన వెంటనే రాఘవేంద్రరావు రూపొందిస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట చిరంజీవి. ఆ సినిమా షూటింగ్‌ ఊటిలో జరుగుతుంది. అక్కడ షూటింగ్‌ అయిపోయింది. ప్యాకప్‌ చెప్పారు. అంతా వెళ్లిపోతున్నారు. చిరంజీవి చెన్నైకి వెళ్తున్నారు.ఆయనకు సంబంధించిన ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేశారు. రైల్వే స్టేషన్‌కి వచ్చారు. ట్రైన్‌ ఎక్కారట. తనతోపాటు సురేఖ కూడా ఉంది. ఇద్దరు కలిసి ట్రైన్‌ ఎక్కగా, తన బెర్త్ ఎక్కడో రాఘవేంద్రరావు గైడ్‌ చేశారట. చిరుకి ప్రత్యేకంగా కుపే అనే బెర్త్ బుక్‌ చేశారట. అందులో రెండు బెర్తులుంటాయి. 

 

తన బెర్త్‌ వద్దకు వెళ్లి చూస్తే ఇటు చిరంజీవి, అటు సురేఖ షాక్‌ అయ్యారు. తన బెర్త్ మొత్తం ఫస్ట్ నైట్‌ బెడ్‌ రూమ్‌ ఎలా ఉంటుందో అలా అలంకరించారట. పూలు, పండ్లు, డెకరేషన్‌ అంతా ఫస్ట్ నైట్‌ బెడ్‌రూమ్‌ని తలపించేలా డిజైన్‌ చేశారని, అది చూసి సురేఖ షాక్‌ కావడమే కాదు, సిగ్గుపడిపోయిందని చెప్పారు చిరంజీవి. మీరు కొత్తగా పెళ్లి చేసుకుని వెంటనే షూటింగ్‌కి వచ్చారు. మీకు టైమ్‌ లేదు, ఎంజాయ్ చేయండి అంటూ రాఘవేంద్రరావు సైలెంట్‌గా చెప్పి వెళ్లిపోయాడట. 

అది తమకు ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీగా ఉండిపోయిందని, రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్తున్నా అని చెబితే, సురేఖ అదే విషయాన్ని గుర్తు చేసిందని చెప్పారు చిరు. అలా ఆర్టిస్ట్ లకు ఎంతో కంఫర్ట్ ని ఇస్తారు రాఘవేంద్రరావు అని, ఎంతో బాగా చూసుకుంటారని తెలిపారు చిరంజీవి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను, ఎప్పుడూ ఇబ్బంది పడిన సందర్భం లేదని పేర్కొన్నారు చిరు. సౌందర్యలహరి కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. 

 

చిరంజీవి ఇప్పటి వరకు 155 చిత్రాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీ ఇది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో భారీ కాస్టింగ్‌ ఉండబోతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. 

2024-06-29T07:57:29Z dg43tfdfdgfd