ది గోట్ లైఫ్ ప్రీమియర్ రివ్యూ: 16 ఏళ్ల ప్రయోగాత్మక చిత్రం గురించి ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

నటుడు పృథ్విరాజ్ సుకుమార్ హీరోగా దర్శకుడు బ్లేస్సి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ది గోట్ లైఫ్(ఆడు జీవితం). ఈ సర్వైవల్ థ్రిల్లర్ మార్చి 28న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏమిటో చూద్దాం.. 

 

ది గోట్ లైఫ్ మూవీ ఆడు జీవితం అనే మలయాళ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆడు జీవితం నిజ జీవిత కథ. బెన్నీ డానియల్ ఈ నావెల్ రాశారు. సౌదీ అరేబియాకు పని కోసం వెళ్లిన ఓ యువకుడి జీవితం ఎంతటి దుర్భరంగా మారిందనేది కథ. దర్శకుడు బ్లేస్సి ఆడు జీవితం నావెల్ ని 2008లోనే సినిమాగా తీయాలనే ఆలోచన చేశారు. 

అయితే బడ్జెట్ పరిమితులతో పాటు అనేక కారణాల వలన 16 ఏళ్లకు ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వచ్చింది. పృథ్విరాజ్ సుకుమారన్, అమలా పాల్ ప్రధాన పాత్రలు చేశారు. ది గోట్ లైఫ్ మూవీ సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. సౌదీ అరేబియా వెళ్లిన నజీబ్ అహ్మద్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. 

 

ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే... కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్ లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మరి నజీబ్ తిరిగి ఇండియాకు వచ్చాడా? బానిస సంకెళ్ళ నుండి బయటపడ్డాడా? అనేది మిగతా కథ... 

ది గోట్ లైఫ్ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్విరాజ్ జీవించాడని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు . 

అమలా పాల్ తన పాత్ర పరిధి మేర మెప్పించింది అంటున్నారు. పృథ్విరాజ్ తర్వాత దర్శకుడు బ్లేస్సి స్టోరీ టెల్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఆడియన్స్. నజీబ్ ట్రాజిక్ లైఫ్ ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు బ్లేస్సి. విజువల్స్ గొప్పగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. 

 

అలాగే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎమోషన్ పండటంలో సహకరించింది అంటున్నారు. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని ఈ ఆర్టిస్టిక్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటున్నారు. ది గోట్ లైఫ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి... 

2024-03-28T04:43:15Z dg43tfdfdgfd