బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది, అనుకున్నకున్న సమయానికి ముందే... లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ అందుతుంది. అనుకున్న సమయానికి ముందే బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ కానుందట. ఆ డేట్ ఎప్పుడో చూద్దాం...  

 

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం.

ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కొన్ని సంచలన పేర్లు బయటపెట్టాడు. సీజన్ 8 కంటెస్టెంట్స్ లో వీరు ఉండే అవకాశం కలదన్నాడు. బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి..  మరింత పాపులారిటీ రాబట్టింది. 

 

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖావాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పడం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. 

 

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖావాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పడం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే.

అలాగే హీరో రాజ్ తరుణ్ రావచ్చట. సురేఖావాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం కలదంటున్నారు. ఇదిలా ఉంటే... జబర్దస్త్ మాజీ కమెడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పచ్చ జెండా ఊపిందట. కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ కూడా  బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు.

దాదాపు కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యిందట.  దీంతో నిర్వాహకులు ఏర్పాట్లు మొదలు పెట్టారట. సెప్టెంబర్ మొదటి వారం లేదా చివరి వారం బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా అనుకున్న సమయం కంటే ఓ నెల ముందుకు తీసుకు వచ్చారట నిర్వాహకులు. 

 

ఆగస్టు మొదటి వారమే బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుందట. అంటే ఆగస్టు 4 లేదా 11 తారీకుల్లో షో మొదలు కానుందట. ఇక జులై లోనే బిగ్ బాస్ 8 ప్రోమోలు మొదలు కానున్నాయట. నాగార్జున షూటింగ్ కి సిద్ధం అవుతున్నారట. ఈ వార్త బిగ్ బాస్ లవర్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది. కాబట్టి ఆగస్టు నుండి మూడు నెలలు నాన్ స్టాప్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు. 

2024-06-30T14:02:15Z dg43tfdfdgfd