మళ్ళీ అలా కనిపించబోతున్న ప్రభాస్.. స్పిరిట్ లో లుక్ ఎలా ఉండబోతోందంటే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మహాభారతం. కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. 

నాగ్ అశ్విన్ టేకింగ్ కి అంతా ఫిదా అవుతున్నారు. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా బేస్ లో తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉండగా కల్కి తర్వాత ప్రభాస్ నుంచి మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం.. సందీప్ వంగా దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతున్నాయి. 

సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు ఆల్రెడీ మ్యాటర్ బయటకి వచ్చింది. అయితే సందీప్ వంగా ప్రభాస్ ని సూపర్ స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారట. దీనితో ప్రభాస్ బాగా సన్నబడాలని సందీప్ సూచించినట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ ఈ చిత్రంలో మిర్చి తరహాలో లీన్ లుక్ లో కనిపిస్తాడట. ఆ విధంగా కనిపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ స్టైలిష్ గా కనిపిస్తే పండగ చేసుకుంటారు. 

2024-06-29T12:12:47Z dg43tfdfdgfd