కల్కి విషయంలో ఊహించని పరిణామం... 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు స్టార్ట్ చేస్తే ప్రభాస్ పూర్తి చేశాడా!

40 ఏళ్ల క్రితం పెదనాన్న కృష్ణంరాజు స్టార్ట్ చేసిన కల్కి చిత్రాన్ని ప్రభాస్ పూర్తి చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఈ విషయం లీక్ చేశారు. ఆ ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం.. 

 

ఇండియా వైడ్ కల్కి 2829 AD ఫీవర్ నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లాడనే మాట వినిపిస్తోంది. మహాభారతాన్ని, కల్కి అవుతారన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిళితం చేసి ఆయన కల్కి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతం అంటున్నారు.

కల్కి మూవీలో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ రోల్ చేశారు. మరో సర్ప్రైజింగ్ రోల్ కూడా ఆయన చేశారు. ఇక అమితాబ్ చేసిన అశ్వద్ధామ రోల్ సినిమాకు హైలెట్. హీరోకి సమానమైన పాత్ర అమితాబ్ కి దక్కింది. దీపికా పదుకొనె, కమల్ హాసన్ సైతం ప్రధాన పాత్రలు చేశారు. కల్కి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందుకు అనుగుణంగానే వసూళ్లు ఉన్నాయి.

కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 500 కోట్లకు చేరాయి. పూర్తి రన్ ముగిసే నాటికి కల్కి భారీ ఫిగర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యూఎస్ లో కల్కి చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటికే $10 మిలియన్ వసూళ్లను దాటేసింది. కేవలం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా కల్కి $3.5 మిలియన్ వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది.

కల్కి చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం  వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కల్కి చిత్రం స్టార్ట్ చేశారట. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందట. తాజాగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

శ్యామలాదేవి మాట్లాడుతూ... దాదాపు 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు కల్కి టైటిల్ తో ఒక చిత్రం చేయాలి అనుకున్నారు. ఒక పాట కూడా ఈ చిత్రం కోసం రికార్డు చేశారు. ఎంఎం కీరవాణి తన మొదటి సాంగ్ కల్కి చిత్రం కోసమే చేశారు.  సూర్యనారాయణరాజు గారు తనకు మొదటి రెమ్యూనరేషన్ ఇచ్చారని కీరవాణి చెప్పుకుంటారు.

కీరవాణి పూజ గదిలో కల్కి చిత్రం కోసం రికార్డు చేసిన సాంగ్ ఉందట. కారణం తెలియదు కానీ కల్కి టైటిల్ తో కృష్ణంరాజు చేయాలనుకున్న మూవీ ఆగిపోయింది. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి అవతారం నేపథ్యంలో ఈ చిత్రం చేశారు. ముందుగా దీనికి ప్రాజెక్ట్ కే అనుకున్నారు. అనంతరం కల్కి అని టైటిల్ పెట్టారు. 40 ఏళ్ల క్రితం కృష్ణంరాజు అనుకున్న మూవీని ప్రభాస్ పూర్తి చేయడం యాదృచ్చికం అని ఆమె అభిప్రాయపడ్డారు.    

2024-07-01T02:19:28Z dg43tfdfdgfd