మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్

ముంబై సైబర్ సెల్ పోలీసులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పరారీలో ఉన్న యాక్టర్ సాహిల్ ఖాన్ ను ఆదివారం పట్టుకున్నారు. అతను వేసిన మధ్యంతర బెయిల్ ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ఆ రాష్ట్రం నుంచి అతను పారిపోయాడు. ఈ రోజు ఉదయం చత్తీష్ గడ్ పోలీసుల సహాయంతో ముంబై సైబర్ సెల్  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చత్తీష్ గడ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసింది. అతన్ని పట్టుకోవడానికి 40 గంటలపాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. సాహిల్ ఖాన్ ను ముంబై కోర్టులో హాజరు పరుచనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగైదు రోజుల క్రితం ఈ కేసు విషయంలో తమన్నా భట్టియాకు కూడా కోర్టు నోటీసులు అందాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్‍కు ప్రమోషన్లు చేసిన కొందరు సినీ యాక్టర్లను ఈడీ విచారణకు పిలిచింది.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-28T05:29:06Z dg43tfdfdgfd