రోజుకు రూ.1 కంటే తక్కువ.. జియో సినిమా ప్రీమియం ప్లాన్ అదుర్స్!

JioCinema అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. ఇది తాజాగా.. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ పడుతూ.. సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం నెలకు రూ.29 ఖర్చుతో జియో సినిమాలు, ఒరిజినల్ సిరీస్, చిల్ట్రన్ షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌లను ఏ డివైజ్ పైనైనా.. యాడ్స్ లేకుండా చూడవచ్చు. అలాగే.. ఇందులోని నెలవారీ ప్లాన్ రూ.89తో.. ఇంట్లోని 4 డివైజ్‌లపై ఒక నెలకు యాడ్స్ లేని కంటెంట్ చూడవచ్చు.

గతేడాది జియో సినిమా రూ.999తో వార్షిక ప్లాన్ తెచ్చింది. తద్వారా హాలీవుడ్ కంటెంట్‌ను యాడ్స్ లేకుండా చూసే వీలు కల్పించింది. అలాగే.. స్థానిక లాంగ్వేజీల ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్‌ను యాడ్స్‌తో చూసే వీలు కల్పించింది.

రోజుకు రూ.1 కంటే తక్కువ.. జియో సినిమా ప్రీమియం ప్లాన్ అదుర్స్!

తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లను ఫ్రీగా చూసేందుకు వీలుంది. కొత్త యాడ్స్ లేని ప్లాన్స్‌తో.. ఒరిజినల్ సిరీస్‌ చూడొచ్చు. ఇందులో రణనీతి: బాలాకోట్, బియోండ్, మర్డర్ ఇన్ మాహిమ్ వంటివి కవర్ అవుతాయి.

---- Polls module would be displayed here ----

పిల్లలకు, ఫ్యామిలీకి నచ్చే మోటు పట్లు, శివ అండ్ రుద్ర, అలాగే.. వయాకాం18 కలిగివున్న టీవీ ఛానెల్స్ నుంచి వచ్చే లోకల్ లాంగ్వేజ్ కంటెంట్, అంటే కలర్స్, నికోలోడియన్ వంటివి యాడ్స్ లేకుండా చూసేందుకు వీలవుతుంది. అలాగే టీవీలో ప్రసారం కాకముందే.. సీరియల్స్.. జియో సినిమా సభ్యులకు లభిస్తాయి. వయాకామ్18 నెట్‌వర్క్‌కి చెందిన 20కి పైగా టీవీ ఛానెల్స్ స్క్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

పీకాక్, HBO, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి వాటితో పార్ట్‌నర్‌షిప్‌లో ఇంటర్నేషనల్ కంటెంట్.. అంటే గేమ్ ఆఫ్ థార్న్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఓపెన్‌హైమర్, బార్బీ వంటివి హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషలో యాడ్స్ లేకుండా అందుబాటులో ఉంటాయి. జియో ఆఫర్ కారణంగా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌‍స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా వాటి సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించే వీలు ఉంటుంది.

2024-04-26T06:05:45Z dg43tfdfdgfd