వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

ఎవరో చెప్పుకోండి చూద్దాం!... ఈ సుందరి ఎవరో మీకు తెలుసా?... ఈమెను గుర్తు పట్టారా?... బాలీవుడ్ మీమ్ పేజీలు, పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే నెటిజనులకు ఈ ట్రెండ్ గురించి ఐడియా ఉంటుంది. ప్రజెంట్ 'గెస్ హూ' (ఎవరో కనిపెట్టండి) హ్యాష్ ట్యాగ్ ముంబై మీడియాలో వెరీ పాపులర్! పైన చెప్పిన క్యాప్షన్స్ కనిపించే వీడియోలు అన్నిటిలో అబ్జర్వ్ చేస్తే కామన్‌గా కనిపించేది ఒక్కటే... ఒక హీరోయిన్ బ్యాక్ నుంచి తీసిన వీడియో! 

బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు తీసే ట్రెండ్ మీద అందాల భామలు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ పాపరాజీ మీద డిస్కషన్ మొదలైంది. 'వద్దమ్మా, బ్యాక్ నుంచి వీడియోలు, ఫోటోలు వంటివి క్యాప్చర్ చెయ్యొద్దమ్మా' అంటూ సున్నితంగా చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు ఎందుకు వద్దంటున్నారు? ముంబైలో వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు ఏమంటున్నారు? అసలు నోరా ఫతేహి ఏం అన్నారు? అనేది ఒక్కసారి చూడండి.

జూమ్ చెయ్యడం అవసరమా?

అటువంటి బ్యాక్ ఎప్పుడూ చూడలేదా?

ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఇట్టాగే రెచ్చపోదాం'తో నోరా ఫతేహి పాపులర్ అయ్యారు. 'బాహుబలి'లో 'మనోహరి...' పాటలో డ్యాన్స్ చేసిన ముగ్గురిలో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో పలు స్పెషల్ సాంగ్స్ చేశారు. ముంబై పాపరాజీకి ఆవిడ ఫేవరెట్ ఫిమేల్ సెలబ్రిటీ. సోషల్ మీడియాలో నోరా వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే... మెజారిటీ వీడియోలు, ఫోటోల్లో నోరా ఫతేహి బ్యాక్ ఫోజులు ఉంటాయి. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన ఫోటోలు, వీడియోలు ఆ విధంగా తియ్యడం మీద నోరా ఫతేహి ఘాటుగా స్పందించింది.

''ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి బ్యాక్ వాళ్లు (మీడియాను ఉద్దేశిస్తూ...) చూడలేదని అనుకుంటున్నా. నా విషయంలో మాత్రమే కాదు... పలువురు ఫిమేల్ సెలబ్రిటీల విషయంలో మీడియా వ్యవహరించిన తీరు సరిగా లేదు. కొంత మంది హీరోయిన్ల బ్యాక్ ఎగ్జైటింగ్ అనిపించలేదేమో!? బాడీ పార్ట్స్ మీద జూమ్ చేశారు. ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. జూమ్ చేసి చూపించడానికి ఏమీ లేకున్నా మీడియా జూమ్ చేస్తుంది'' అని నోరా ఫతేహి పేర్కొంది. దాంతో ఇప్పుడు బ్యాక్ ఫోజులు ఇవ్వటానికి 'నో' చెప్పిన అందాల భామల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా

'సీతా రామం', 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తెలుగులో సినిమాలు చెయ్యడానికి ముందు హిందీలో ఆవిడ పాపులర్. టీవీ సీరియల్స్, సినిమాలు చేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో బ్యాక్ ఫోజ్ ఇవ్వమంటే నిరాకరించింది. అంతే కాదు... 'మీ కెమెరాలు అక్కడికి వెళతాయి'' అని చెప్పుకొచ్చింది. అంతకు ముందు తన థైస్ మీద వచ్చిన విమర్శల గురించి కూడా ఆవిడ స్పందించింది. ''పీచే కా మత్ లేనా'' (వెనుక నుంచి ఫోటోలు, వీడియోలు తియ్యవద్దు) అని యంగ్ యాక్ట్రెస్ పాలక్ తివారి ఓసారి మీడియాను రిక్వెస్ట్ చేసింది. 

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

'అల్లరి' నరేశ్ 'ఆ ఒక్కడు' హీరోయిన్... రామ్ చరణ్ 'ఆరెంజ్', నాగ చైతన్య 'దోచెయ్' సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసిన నైరా బెనర్జీ (మధురిమ) సైతం ఒక ఈవెంట్ దగ్గర బ్యాక్ ఫోజ్ ఇవ్వకుండా పరుగులు తీసింది.

అందాల భామల ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే... బ్యాక్ నుండి కాదు, ఫ్రంట్ నుండి తీసిన వీడియోల్లో బాడీ పార్ట్స్ జూమ్ చేసి పోస్ట్ చెయ్యడం వల్ల ఇబ్బంది నెటిజన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. స్కిన్ షో చేస్తున్నారని ఫ్యామిలీ ఆడియన్స్ కోప్పడుతున్నారు. అయితే, ముంబై పాపరాజీ వెర్షన్ వేరుగా ఉంది.

నోరా ఫతేహి కావాలని చేస్తుందా!?

మృణాల్ ఠాకూర్, పాలక్ తివారి వంటి హీరోయిన్ల విషయంలో ఇటు ఆడియన్స్, అటు ముంబై పాపరాజీ నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. కానీ, నోరా ఫతేహి ఇంటర్వ్యూ బ్యాక్ ఫైర్ అయ్యింది. ఆవిడ కావాలని కంటిన్యూగా బ్యాక్ ఫోజులు ఇస్తుందని మీడియాలో కొందరు చెబుతున్నారు. ఇటీవల డ్యాన్స్ ప్లస్ షోలో నోరా ఫతేహి తన బ్యాక్ మీద వాటర్ బాటిల్‌తో వీడియో పోస్తూ వేసిన స్టెప్స్ వీడియో గుర్తు చేస్తున్నారు. 

ఒక్కటి మాత్రం నిజం... బ్యాక్ ఫోజ్ ఫోటోస్, వీడియోస్ క్యాప్చరింగ్ వల్ల కొంత మంది హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. బాడీ పార్ట్స్ జూమ్ చేసే వీడియోలు ఫ్యామిలీ ప్రేక్షకులకు వాళ్లను దూరం చేస్తున్నాయి. ప్రస్తుతానికి బీ టౌన్ హీరోయిన్లు వర్సెస్ పాపరాజీ మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

Also Readపుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లు - ఈ సినిమాలే ఎందుకంత స్పెషల్?

2024-04-25T04:37:17Z dg43tfdfdgfd