వేములవాడ రాజన్న భక్తుల ఆవేదన.. అసలు కారణం ఇదే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ కు చెందిన తౌటం సతీష్, మారుపాక రమేష్ ల వారివారి కుటుంబాలతో స్వామి వారి దర్శనార్థం వేములవాడకు వచ్చారు. అయితే దర్శనం చేసుకుని తిరిగివచ్చేసరికి వారు తీసుకున్న పార్వతీపురం వసతి గది సమీపంలోనే కార్ పార్క్ చేసిన ప్రాంతంలో దండంపై ఆరేసిన వారి వస్త్రాలు కాలిపోయి దర్శనమిచ్చాయి.

దీంతో ఈ సమాచారాన్ని ఆలయ అధికారులకు ఇచ్చిన సరైన స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకల్18తో భక్తులు మాట్లాడుతూ.. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినా కూడా భక్తుల సౌకర్యార్థం రక్షణార్థం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.

---- Polls module would be displayed here ----

భక్తులకు సరైన సౌకర్యాలు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగితే దానికి బాధ్యులు ఎవరని ఆలయ అధికారులను లోకల్18 ముఖంగా ప్రశ్నించారు. వసతి గదుల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్ కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. భక్తుల భద్రత విషయంలో ఆలయ అధికారులు విఫలం అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ... ఈ సంఘటన ఎలా జరిగిందో.. దీనికి కారణమైనవారిపై చర్యలు తీసుకొని కోరిన సంబంధిత సిబ్బంది అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన వారెవరో సీసీ పుటేజ్ చూస్తే కనుకొచ్చు అని చెప్పినా వినటం లేదని పేర్కొన్నారు. ఆలయ వసతి గది ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు.

భర్త కోరిక తీర్చిన ఇద్దరు భార్యలు.. ఆడ జాతి ఆణిముత్యాలు!

ఇప్పటికైనా అధికారులు స్పందించి హిందువుల, భక్తుల మనోభావాలు కాపాడాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. కోట్లలో ఆదాయం వచ్చినా కూడా సౌకర్యాలు.. అభివృద్ధి చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదంటూ లోకల్18కి తెలిపారు.

2024-07-01T07:38:10Z dg43tfdfdgfd