ANUSHKA SHETTY: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. ఇంతకీ అదేమిటంటే!

Anushka Laughing Disease: అటు కమర్షియల్ సినిమాలతో మాత్రమే.. కాక ఇటు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా అనుష్క శెట్టి బోలెడు హిట్ లు అందుకుంది. టాలీవుడ్ లో మాత్రమే కాక.. బాహుబలి సినిమా కారణంగా ఈమె క్రేజ్ ప్రపంచం వ్యాప్తంగా పెరిగింది. 

అయితే బాహుబలి సినిమా తర్వాత.. ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయిన..అనుష్క మళ్ళీ ఈ మధ్యనే మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో.. మంచి హిట్ అందుకుంది. నవీన్ పోలిశెట్టి.. హీరోగా గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ..మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క శెట్టి.. తాను ఎప్పటినుంచో ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

అనుష్క లాఫింగ్ డిసీజ్ లో బాధపడుతుందట. ముఖం మీద ఎప్పుడు చిరునవ్వుతో ఉండే.. అనుష్క కి కూడా వ్యాధి ఉందా.. అని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే పేరులోనే ఆ వ్యాధి ఏంటో తెలుస్తుంది. నవ్వడం వ్యాధి ఎలా అవుతుంది.. అని అందరూ అనుకుంటారు కానీ ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఒకసారి నవ్వు వస్తే.. చాలాసేపటి వరకు దాన్ని ఆపుకోలేరు. 

"అవును నాకు లాఫింగ్ డిసీజ్ ఉంది. నవ్వడం రోగమెలా అవుతుంది.. అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఒకసారి నవ్వడం మొదలుపెడితే 15 నుండి 20 నిమిషాల పాటు.. నవ్వుతూనే ఉంటాను. ఎప్పుడైనా కామెడీ సన్నివేశాలు చూసినా, అందులో నటిస్తున్నా నవ్వు ఆపుకోలేక కిందపడి నవ్విన సందర్భాలు.. కూడా ఉన్నాయి. ఆ కారణంగా కొన్నిసార్లు షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చింది" అంటూ తనకున్న వ్యాధి గురించి చెప్పింది అనుష్క. 

నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని పెద్దలు అన్నారు కానీ ఇప్పుడు నవ్వడం కూడా ఒక రోగం.. అనే అనుష్క చూస్తేనే తెలుస్తుంది అని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే.. తెలుగులో గాటి అనే ఒక సినిమాతో బిజీగా ఉన్న.. అనుష్క త్వరలో కథనర్ అనే సినిమాతో మలయాళం లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధం అవుతుంది. అనుష్క ని మళ్ళీ వెండి తెర మీద చూడటానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

2024-06-28T15:39:29Z dg43tfdfdgfd