MANJULA GHATTAMANENI: పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలే అవసరం లేదు - కృష్ణ కూతురు మంజుల వ్యాఖ్యలు వైరల్

Manjula Ghattamaneni About Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనని నిలబెట్టడం కోసం టీడీపీతో కలిసి ప్రచారాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రచారాలలో, మీటింగ్స్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్‌లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చాలామంది ప్రేక్షకులు ఆయన స్పీచ్‌లు చూస్తారు. కానీ తాజాగా పవన్ ఇచ్చిన స్పీచ్ కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ పేరును ప్రస్తావించి అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకున్నారు ఈ హీరో. ఈ సందర్భంగా కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కథ ఉంది..

కృష్ణ వారసురాలిగా, మహేశ్ బాబు సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మంజుల ఘట్టమనేని. కానీ తనకు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అంతగా కలిసి రాలేదు. దీంతో ఆఫ్ స్క్రీన్ డైరెక్షన్‌లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితమయ్యింది. అయితే తను డైరెక్టర్‌గా సినిమా చేసిన రోజుల్లో పవన్ కళ్యాణ్‌తో కూడా సినిమా చేస్తానని మంజుల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన దగ్గర కథ ఉందని, పవన్‌తో సినిమా చేస్తానని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతే కాకుండా అప్పట్లో ఆమె పాల్గొన్న చాలావరకు ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు మంజుల ఘట్టమనేని.

న్యూస్ టాపిక్..

‘‘నేను దాని గురించి ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇంక మాట్లాడను. నేను పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని కాన్ఫిడెన్స్‌తో చెప్పలేదు. ఒక షోలో మామూలుగా అది జరిగిపోయింది. అప్పటినుండి అందరికీ ఇదొక న్యూస్ టాపిక్ అయిపోయింది. నా దగ్గర ఆయనకు తగిన కథ ఉందని అనుకుంటున్నాను. అది వర్కవుట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే ఆలోచన కూడా లేదు. కానీ ఎందుకో అలా చెప్పాలనిపించింది చెప్పేశాను’’ అని మంజుల క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఇంక సినిమాలు చేయను అనే సమయానికే మంజుల డైరెక్టర్‌గా మారారు. అప్పుడే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దానిపై కూడా మంజుల స్పందించారు.

ఆయనంటే ఇష్టం..

‘‘పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ అసలు సాటిలేని హీరోలు అయిపోయారు. అందుకే ఇప్పుడు వెళ్లి ప్రజా సేవ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన సింపుల్‌గా సినిమాలు ఎంజాయ్ చేయవచ్చు. కెరీర్ అంత పీక్‌లో ఉన్నప్పుడు ఎవరు ఇలా చేస్తారు? ఎన్‌టీఆర్, ఎమ్‌జీఆర్ లాంటి వారు కొన్నేళ్ల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ చేసింది మాత్రం సాధారణమైనది కాదు. ఎందుకంటే ప్రజాసేవ అనేది ఆయన మనసు నుండి వస్తుందని, స్వచ్ఛమైనదని స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి లీడర్లు చాలా అవసరం. అది స్వార్థం నుండి పుట్టింది కాదు. నాకు పవన్ కళ్యాణ్‌తో వ్యక్తిగత పరిచయం ఏం లేదు. కానీ నేను చూస్తున్నంత వరకు ఆయనకు రాజకీయంలోకి రావాలనే ఇంట్రెస్ట్ మనసు నుండి వచ్చిందని కనిపిస్తుంది. మనసు చెప్పింది వినేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆయన ఒకరు’’ అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రశంసల్లో ముంచేశారు మంజుల.

Also Read: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?

2024-04-26T12:29:21Z dg43tfdfdgfd