SIVAKARTHIKEYAN: 14 ఏళ్ల తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో సినిమా చేస్తున్న యాక్టర్

మురుగదాస్ డైరెక్షన్‌లో శివకార్తికేయన్ చేస్తున్న సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ బిజు మీనన్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై బిజు మీనన్ క్లారిటీ ఇచ్చేశారు. SK 23లో తాను కీలక పాత్ర పోషిస్తున్నట్లు బిజు తెలిపారు." SK 23 ఒక భారీ ప్రాజెక్ట్.. అందుకే ఒక సంవత్సరం పాటు డేట్స్ నేను ఈ సినిమాకి కేటాయించాను. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నా పాత్ర ఉంటుంది." అంటూ బిజు చెప్పారు.

'పోర్కలం' సినిమా తరవాత బిజు మీనన్ చేస్తున్న కోలివుడ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాలో రీఎంట్రీ ఇస్తున్నారు బిజు. ఇక SK 23 చిత్రంలో శాండిల్‌వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

వరుస హిట్లు

ఇక శివకార్తికేయన్ కెరీర్ విషయానికొస్తే 'అయలాన్' సినిమాతో ఈ పొంగల్‌కి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అంతకుముందు రిలీజైన మావీరన్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక అయలాన్ సినిమా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రానికి పోటీగా బరిలోకి దిగిన అందరి అంచనాలను మించి సూపర్ హిట్ అయింది. దీంతో శివకార్తికేయన్ తరువాతి ప్రాజెక్టులపై క్రేజ్ మరింత ఎక్కువైంది. ఇక తాజాగా తన కొత్త సినిమా 'అమరన్' (Amaran) నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి శివ కార్తికేయన్ చేస్తున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ జవాన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇన్నాళ్లూ లవర్ బాయ్‌గా మెప్పించిన ఆయన ఈ చిత్రంలో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్న శివకార్తికేయన్ తెలుగు మార్కెట్‌పైనా గట్టిగానే దృష్టి పెడుతున్నారు. తన తరువాతి చిత్రాలను తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. గతంలో అయలాన్ సినిమాను అలానే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తెలుగులో సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు దొరకలేదు. దీంతో అయలాన్ వాయిదా పడాల్సి వచ్చింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T06:01:05Z dg43tfdfdgfd